Advertisementt

గాంఢీవధారికి డేట్ ఫిక్స్ చేసిన మెగా ప్రిన్స్

Wed 07th Jun 2023 05:24 PM
gandheevadhari arjuna  గాంఢీవధారికి డేట్ ఫిక్స్ చేసిన మెగా ప్రిన్స్
Gandheevadhari Arjuna release date announced గాంఢీవధారికి డేట్ ఫిక్స్ చేసిన మెగా ప్రిన్స్
Advertisement
Ads by CJ

డిఫ‌రెంట్ మూవీస్ చేస్తూ అల‌రిస్తోన్న మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, టాలెంటెడ్ ఫిల్మ్ మేక‌ర్ ప్ర‌వీణ్ సత్తారు కాంబినేష‌న్‌లో  రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ గాంఢీవధారి అర్జున. స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సులతో రూపొందుతోన్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇన్‌టెన్స్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్‌.. అందులో వ‌రుణ్ తేజ్ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే రీసెంట్‌గా విడుద‌లైన బీటీఎస్ వీడియో గ్లింప్స్‌తో సినిమాపై మంచి బ‌జ్ క్రియేట్ అయ్యింది. 

చిత్ర యూనిట్ విదేశాల్లో శ‌ర‌వేగంగా సినిమా షూటింగ్‌ను పూర్తి చేసే ప‌నిలో నిమ‌గ్న‌మై ఉన్నారు. ఈ మూవీలో యాక్ష‌న్ సీక్వెన్స్ హైలైట్‌గా నిలుస్తాయ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు. గాంఢీవధారి అర్జున చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఆగ‌స్ట్ 25 భారీ ఎత్తున రిలీజ్ చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు. సినీ చిత్రీకర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. మ‌రో వైపు నిర్మాణానంతర కార్యక్ర‌మాల‌ను పూర్తి చేయ‌టానికి టీమ్ చాలా క‌ష్ట‌ప‌డుతోంది. 

వ‌రుణ్ తేజ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ‌డ్జెట్ మూవీగా రూపొందుతోన్న ‘గాంఢీవధారి అర్జున’ చిత్రంలో యాక్ష‌న్ సీక్వెన్సెస్ టెక్నిక‌ల్ హై స్టాండ‌ర్డ్స్‌తో మెప్పించనున్నాయి. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ  శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై సీనియర్ నిర్మాత బి.వి.ఎస్‌.ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. ఎన్నో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌కు సంగీతాన్ని అందించిన మిక్కి జె.మేయ‌ర్ ఈ చిత్రానికి సంగీత సార‌థ్యం వ‌హిస్తుండ‌గా, ముఖేష్ సినిమాటోగ్ర‌ఫీ, అవినాష్ కొల్ల ఆర్ట్ వ‌ర్క్‌ను అందిస్తున్నారు. 

గాంఢీవధారి అర్జున చిత్రం ఆగస్ట్ 25న వరల్డ్ వైడ్‌గా భారీ ఎత్తున విడుద‌ల‌వుతుంది.

Gandheevadhari Arjuna release date announced :

Gandheevadhari Arjuna release on August 25th

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ