Advertisementt

కొత్త బ్యానర్ మొదలుపెట్టిన రామ్ చరణ్

Thu 25th May 2023 06:16 PM
ram charan  కొత్త బ్యానర్ మొదలుపెట్టిన రామ్ చరణ్
Ram Charan encourages new talent కొత్త బ్యానర్ మొదలుపెట్టిన రామ్ చరణ్
Advertisement
Ads by CJ

ఆస్కార్ విన్నింగ్ మూవీ RRRతో  వ‌ర‌ల్డ్ వైప్ పాపులారిటీ ద‌క్కించుకున్నారు గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌. ఆయ‌న యువీ క్రియేష‌న్స్‌లోని త‌న స్నేహితుడు విక్ర‌మ్ రెడ్డితో చేతులు క‌లిపారు. కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌ను, యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌టానికి వీరిద్దరూ వి మెగా పిక్చర్స్ బ్యానర్‌ను ప్రారంభించారు. పాన్ ఇండియా ప్రేక్ష‌కులు మెచ్చేలా విల‌క్ష‌ణ‌మైన చిత్రాల‌ను ఈ సంస్థ రూపొందించ‌నుంది. అదే స‌మ‌యంలో యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌టానికి వేదిక‌గా మారుతుంది. 

నిర్మాణ సంస్థ వి మెగా పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌లో విల‌క్ష‌ణ‌మైన క‌థాంశాల‌తో పాటు తిరుగులేని వినోదాన్ని ప్రేక్ష‌కులకు అందిచంటానికి సిద్ధంగా ఉంది. సినీ నిర్మాణంలో అసాధార‌ణ‌మైన ఆస‌క్తి తో పాటు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌దనాన్ని అందించాల‌నే ఆలోచ‌న ఉన్న టీమ్ ఆధ్వ‌ర్యంలో ఈ నిర్మాణ సంస్థ ముందుకు సాగ‌నుంది. సినీ ప‌రిశ్ర‌మలో ఎవ‌రూ గుర్తించ‌ని ప్ర‌తిభ‌ను గుర్తించి ప్రోత్స‌హించాల‌నే దానికి క‌ట్టుబ‌డి ఉంది. 

ఈ సంద‌ర్బంగా రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ మా వి మెగా పిక్చర్స్ బ్యానర్ విలక్ష‌ణ‌మైన ఆలోచనలను ఆవిష్క‌రిస్తూ స‌రికొత్త‌, వైవిధ‌మ్యైన వాతావ‌ర‌ణాన్ని పెంపొందించ‌టానికి సిద్దంగా ఉన్నాం. సృజ‌నాత్మ‌క‌త‌తో సినిమా స‌రిహ‌ద్దుల‌ను చెరిపేస్తాం. ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇండ‌స్ట్రీలో అభివృద్ధి చెందుతోన్న టాలెంట్‌ని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసి ఓ  స‌రికొత్త ప్ర‌భావాన్ని చూపించ‌ట‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నాం’ అన్నారు. 

యువీ క్రియేషన్స్ విక్రమ్ మాట్లాడుతూ ఈస‌రికొత్త ప్ర‌యాణాన్ని ప్రారంభించ‌టం అనేది మాలో తెలియ‌ని ఆనందాన్ని క‌లిగిస్తోంది. ఎంతో ప్రతిభ ఉన్న నటీనటులు, రచయితలు, దర్శకులు, సాంకేతిక నిపుణులతో క‌లిసి వి మెగా పిక్చ‌ర్స ప‌ని చేయ‌నుంది. వెండితెర‌పై చూపించ‌బోయే స్టోరీ టెల్లింగ్‌లో ఓ కొత్త ఒర‌వ‌డిని తీసుకు రావాల‌నుకుంటున్నాం. దీని వ‌ల్ల సినీ ఇండ‌స్ట్రీ హ‌ద్దులు చెరిపేయ‌ట‌మే మా ల‌క్ష్యం అన్నారు.

Ram Charan encourages new talent :

Global Star Ram Charan encourages new talent with V Mega Pictures!

Tags:   RAM CHARAN
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ