అల్లరి ఉగ్రం రిలీజ్ డేట్

Ugram release date announced Ugram release date announced

అల్లరి నరేష్ , విజయ్ కనకమేడల టీమ్ వర్క్ తెలుగులో క్రేజీ కాంబినేషన్‌లో ఒకటిగా మారుతోంది. వీరిద్దరు కలిసి చేసిన మొదటి చిత్రం నాంది విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ సక్సెస్ ని అందుకొని, వారి రెండవ చిత్రం ఉగ్రంపై పాజిటివ్ బజ్‌ని  క్రియేట్ చేసింది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ మంచి స్పందన వచ్చింది. నరేష్ సీరియస్ కాప్ రోల్‌లో కనిపించడం క్యురియాసిటీని పెంచింది. ఫస్ట్ సింగిల్ దేవేరికి అద్భుతమైన స్పందన రావడంతో  బ్లాక్‌బస్టర్ నోట్‌లో మ్యూజిక్  ప్రమోషన్‌లను కూడా ప్రారంభించారు. మేకర్స్ ఈరోజు సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు. వేసవిలో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ లో ఒకటిగా ఉగ్రం మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.  రిలీజ్ డేట్ పోస్టర్‌లో అల్లరి నరేష్ ఇంటెన్స్ గా కనిపిస్తున్నారు.

యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి,  హరీష్ పెద్ది గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.  తూమ్ వెంకట్ కథ అందించగా, అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు.

Allari Naresh Ugram release date

ugram