Advertisement

కస్టడీ టీజర్ రివ్యూ

Thu 16th Mar 2023 05:48 PM
custody teaser  కస్టడీ టీజర్ రివ్యూ
Custody Teaser Review కస్టడీ టీజర్ రివ్యూ
Advertisement

అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం కస్టడీ వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. టీజర్‌ టీజ్ తో క్యూరియాసిటీ క్రియేట్ చేసిన మేకర్స్ టీజర్‌తో వచ్చారు.

నాగ చైతన్య వాయిస్‌ ఓవర్‌తో టీజర్ ప్రారంభమవుతుంది. గాయపడిన మనసు ఆ మనిషిని ఎంత దూరం అయినా తీసుకెళుతుంది. అది ఇప్పుడు నన్ను తీసుకొచ్చింది ఓ యుద్ధానికి. ఇక్కడ నన్ను చావు వెంటాడుతుంది. అది ఎటు నుంచి వస్తుందో ఎప్పుడు , ఎలా వస్తుందో నాకు తెలీదు. తెలుసుకోవాలని కూడా లేదు. ఎందుకంటే నా చేతిలో వున్న ఆయుధం ఒక నిజం. నిజం ఒక ధైర్యం. నిజం ఒక సైన్యం. యస్.. దట్ ట్రూత్ ఈజ్ ఇన్ మై కస్టడీ అనే వాయిస్ ఓవర్ చాలా ఆసక్తికరంగా వుంది.  

నాగ చైతన్య తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. కృతి శెట్టి అతని గర్ల్‌ఫ్రెండ్‌గా కూల్‌గా కనిపించింది. అరవింద్ స్వామి తన విలనీ యాక్టింగ్‌తో క్యారెక్టర్‌కి ఎక్స్‌ట్రా ఇంటెన్సిటీని తీసుకొచ్చాడు. శరత్‌కుమార్, ఇతర నటీనటులు తమ తమ పాత్రల్లో కన్విన్సింగ్‌గా కనిపించారు.

ఎప్పుడూ కొత్తదనం వుండే కథలనే ఎంచుకునే జీనియస్ వెంకట్ ప్రభు మరో యూనిక్ కాన్సెప్ట్‌తో వచ్చారు. కథాంశం గురించి పెద్దగా వెల్లడించకుండా, టీజర్‌ చూపించిన విధానం క్యురియాసిటీని పెంచింది.

Custody Teaser Review:

Naga Chaitanya Custody Teaser Review

Tags:   CUSTODY TEASER
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement