నితిన్ ప్రారంభిచిన బాబాయ్ హోటల్

Mon 23rd Jan 2023 05:35 PM
babai hotel,nithin  నితిన్ ప్రారంభిచిన బాబాయ్ హోటల్
Babai Hotel Opening in Hyderabad నితిన్ ప్రారంభిచిన బాబాయ్ హోటల్

స్టార్ హీరో నితిన్ చేతుల మీదుగా మణికొండలో బాబాయ్ హోటల్ ప్రారంభం 

ఎంత సంపాదించినా జానెడు పొట్ట నింపడం కోసం.. కోటి విద్యలు కూటి కొరకే అని అంటుంటారు. అలా మనం మంచి ఆహారాన్ని ఆస్వాధించడ, రుచికరమైన భోజనాన్ని తినడం చాలా కష్టంగా మారిపోయింది. ఇప్పుడున్న హడావిడిలో భోజన ప్రియులకు చక్కటి ఆహారాన్ని అందించేందుకు బాబాయ్ హోటల్‌ హైద్రాబాద్‌కు వచ్చింది. ఎనిమిది దశాబ్దాల నుంచి విజయవాడలో బాబోయ్ హోటల్ రుచికరమైన భోజనాన్ని అందిస్తూ తన స్థాయిని పెంచుకుంటూ వచ్చింది.

ఇప్పుడు బాబాయ్ హోటల్ బ్రాంచ్‌ను స్టార్ హీరో నితిన్‌ చేతుల మీదుగా మణికొండలో ప్రారంభించారు. డైరెక్టర్ శశికాంత్ తన స్నేహితులతో కలిసి ఫ్రెండ్స్ ఫ్యాక్టరీని స్థాపించారు. ఫ్రెండ్స్ ఫ్యాక్టరీ పేరు మీదే ఈ బాబాయ్ హోటల్‌ను హైద్రాబాద్‌లోని మణికొండకు తీసుకొచ్చారు.

ఎనిమిది దశాబ్దాలుగా విజయవాడలో ప్రఖ్యాతి గాంచిన బాబాయ్ హోటల్‌ని మణికొండకి తీసుకురావడం సంతోషంగా ఉందని, అద్భుతమైన వంటకాలని చక్కటి శుచీశుభ్రతలతో అందిస్తున్నామని హోటల్ నిర్వాహకులు తెలిపారు. ఒక్కసారి రుచి చూసిన వాళ్లు పర్మినెంట్‌ కస్టమర్లుగా మారుతారు అన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 

ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత సుధాకర్ రెడ్డి, డైరెక్టర్ వెంకీ కుడుముల, రామ జోగయ్య శాస్త్రి, రచయిత దర్శకుడు వక్కంతం వంశీ, నిర్మాత ఠాగూర్ మధు తదితరులు పాల్గొని బెస్ట్ విషెస్ తెలిపారు.

Babai Hotel Opening in Hyderabad:

Babai Hotel Opening in Hyderabad

Tags:   BABAI HOTEL, NITHIN