Advertisement

ఫైనల్లీ గాడ్ ఫాదర్ వీడియో సాంగ్ వచ్చేసింది

Wed 21st Sep 2022 05:32 PM
chiranjeevi –salman khan,godfather  ఫైనల్లీ గాడ్ ఫాదర్ వీడియో సాంగ్ వచ్చేసింది
GodFather 1st Single Thaar Maar Released ఫైనల్లీ గాడ్ ఫాదర్ వీడియో సాంగ్ వచ్చేసింది
Advertisement

చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి మెగా మాస్ జాతర సృష్టించిన గాడ్ ఫాదర్ థార్ మార్ సాంగ్ ప్రోమో మెగా డ్యాన్స్ నంబర్‌పై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. చిరు-సల్మాన్ ఇద్దరూ తమదైన స్టైల్‌తో డ్యాన్స్ ఫ్లోర్‌ను షేక్ చేయడం అభిమానులకు కన్నుల పండగలా మారింది. థార్ మార్ పూర్తి పాట తెలుగు, హిందీ భాషల్లో తాజాగా విడుదలైయింది. ఈ పాట నిజంగా చిరంజీవి, సల్మాన్ ఖాన్ స్టార్‌డమ్‌ను గ్లోరిఫై చేయడంతో పాటు చూడటానికి విజువల్ ట్రీట్‌గా వుంది.

ఈ మెగా మాస్ ఫీస్ట్ లో చిరంజీవి, సల్మాన్ ఖాన్ మాస్ హుక్ స్టెప్ వేయడం ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది. ఈ పాటకు తమన్ స్కోర్ చేసిన ఫంకీ బీట్‌ మళ్ళీమళ్ళీ వినాలనిపించే మెగా డ్యాన్స్ నెంబర్ గా ఆకట్టుకుంది. ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన ఈ వీడియోలో చిరంజీవి తన ముఖం మీద చేయి వేసుకుని స్టైలిష్ ఎంట్రీ ఇవ్వగా, సల్మాన్ తన గోళ్లు కొరుకుతూ మాస్ ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరు మెగాస్టార్లు నల్లటి దుస్తులను ధరించి, బ్లాక్ షేడ్స్‌లో అదరగొట్టారు.

 

GodFather 1st Single Thaar Maar Released:

Chiranjeevi –Salman Khan GodFather 1st Single Thaar Maar Released In Telugu, Hindi

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement