Advertisement

ఎంఎస్ రాజు గారి సినిమా అనగానే ఎగిరి గంతేశా

Wed 15th Jun 2022 06:19 PM
roshan,roshan interview,7 days 6 nights,roshan interview about 7 days 6 nights  ఎంఎస్ రాజు గారి సినిమా అనగానే ఎగిరి గంతేశా
Roshan Interview ఎంఎస్ రాజు గారి సినిమా అనగానే ఎగిరి గంతేశా
Advertisement

మెగా మేకర్ ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన తాజా సినిమా 7 డేస్ 6 నైట్స్. డర్టీ హరితో గతేడాది బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఆయన, ఆ తర్వాత తీసిన చిత్రమిది. మెగా బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మించారు. వైల్డ్ హనీ ప్రోడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు చిత్రనిర్మాణంలో భాగస్వాములు. ఇందులో సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలు. సినిమా జూన్ 24న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా రోహన్ మీడియాతో ముచ్చటించారు. 

ప్రశ్న: మీది ఏ ఊరు? మీ నేపథ్యం ఏమిటి?

రోహన్: మా తల్లిదండ్రులు ఇద్దరిదీ గుంటూరు. నాన్నగారు ఎయిర్ ఫోర్స్ పైలట్. అందువల్ల, చిన్నతనం నుంచి దేశంలో వివిధ ప్రాంతాల్లో పెరిగా. పాన్ ఇండియా చైల్డ్ అనుకోండి. హైదరాబాద్‌లోనూ చదివా. ఫ్రాన్స్‌లో స్కాలర్షిప్ వస్తే మెకానికల్ ఇంజనీరింగ్ & రోబోటిక్స్‌లో బ్యాచిలర్ అండ్ మాస్టర్స్ చేశా. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. నాకు ఇండస్ట్రీలో ఎవరూ తెలియదు కాబట్టి అవకాశాలు వస్తాయా? లేదా? అనే ఆలోచన ఉండేది. ఫ్రాన్స్‌లో ఉన్నప్పుడు థియేటర్ చేశా. శిక్షణ తీసుకున్నా. అప్పుడు యాక్టింగ్‌తో ప్రేమలో పడ్డాను. థియేటర్ అయ్యాక ఇంట్లో చెప్పి యూరోప్‌లో ఫిల్మ్ స్కూల్‌లో అప్లై చేశా. 

ప్రశ్న: 7 డేస్ 6 నైట్స్ అవకాశం ఎలా వచ్చింది?

రోహన్: ఫిల్మ్ స్కూల్‌లో ఉన్నప్పుడు షో రీల్ కూడా చేశా. ఇక్కడికి వచ్చి ఆడియన్స్ ఇచ్చేవాడిని. దర్శక, నిర్మాతలను కలిసినప్పుడు అది చూపించేవాడిని. ఆ షో రీల్ సునీల్ గారి చేతిలో పడింది. అదే రోజు ఆయన ఎంఎస్ రాజు గారిని కలిశారు. నా షో రీల్ చూపించారట. అప్పుడు ఆయన 7 డేస్ 6 నైట్స్ చేయాలనుకుంటున్నారు. కొత్తవాళ్లను తీసుకుందామనే ఆలోచనలో ఉన్న రాజు గారు... ఒక పాత్రకు నేను సూట్ అవుతానని తీసుకున్నారు. ఎంఎస్ రాజు గారి మూవీ కావడంతో ఎగిరి గంతేశా. రెండు ఆడిషన్స్ తర్వాత నన్ను ఫైనలైజ్ చేశారు. 

ప్రశ్న: సినిమాలో మీ క్యారెక్టర్ ఏంటి?

రోహన్: నా పాత్ర పేరు మంగళం. మన స్నేహితులలో అటువంటి వ్యక్తి ఎవరో ఒకరు ఉంటారు. ఎటువంటి భయాలు లేకుండా అమ్మాయిలతో మాట్లాడుతూ ఉంటాడు. మనం ఈ పని చేస్తే ఏమవుతుందనేది ఆలోచించకుండా జీవితంలో అనుకున్నది చేస్తాడు. స్నేహితుడు ఆనంద్‌తో కలిసి మంగళం బ్యాచిలర్ ట్రిప్‌కి వెళతాడు. ఆ ట్రిప్‌లో ఏం జరిగిందనేది కథ. 

ప్రశ్న: పోస్టర్స్, ట్రైలర్స్ చూస్తుంటే... చాలా రొమాంటిక్‌గా ఉన్నాయి!

రోహన్: నేను సినిమా చూశా. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి చూసినా... ఎక్కడా అసౌకర్యంగా ఉండదు. చీప్ కంటెంట్ అని ఎక్కడా అనిపించదు. 

ప్రశ్న: 6 డేస్ 7 నైట్స్ అని ఇంగ్లిష్ సినిమా ఉంది!

రోహన్: ఆ సినిమాకు, మా సినిమాకు అసలు సంబంధం లేదు. 

ప్రశ్న: ఎంఎస్ రాజు గారు బ్లాక్ బస్టర్స్ తీశారు. హీరోలకు కెరీర్ బెస్ట్ హిట్స్ ఇచ్చారు. ఆయన దర్శకత్వంలో నటించడం...

రోహన్: ఎంఎస్ రాజు సినిమాలు చూస్తూ పెరిగా. ఆయన సినిమా అంటే నాకు చాలా పెద్ద అవకాశం. ఆయన బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. షూటింగ్ ఫస్ట్ డే నెర్వస్ ఫీలయ్యా. రెండు మూడు టేక్స్ ఓకే కాలేదు. అప్పుడు ఆయన పక్కకి పిలిచి నీలో పొటెన్షియల్ ఉంది. అందుకే, తీసుకున్నా. నువ్వు నెర్వస్ ఫీలవకు. క్యారెక్టర్ మీద ఫోకస్ చెయ్ అని చెప్పారు. రెండో రోజుకు సెట్ అయిపోయా. 

ప్రశ్న: సుమంత్ అశ్విన్‌తో నటించడం...

రోహన్: తొలిసారి కలిసినప్పుడు కొంచెం భయపడ్డా. సుమంత్ అన్న ఎస్టాబ్లిష్ అయిన యాక్టర్ కదా! అయితే, అన్న చాలా డౌన్ టు ఎర్త్. ఎంఎస్ రాజు అబ్బాయి అనే యాటిట్యూడ్ ఎక్కడా చూపించలేదు.

ప్రశ్న: ఇటువంటి జానర్ సినిమా ఎంపిక చేసుకోవడానికి కారణం?

రోహన్: నటుడిగా మనకు కొన్ని పాత్రలు చేయాలని ఉంటుంది. 7 డేస్ 6 నైట్స్లో నాది కొంచెం కామెడీ రోల్. కామెడీ చాలా కష్టమైన జానర్. నేనూ కొంచెం కష్టం అనుకున్నాను. ఎంఎస్ రాజు గారు ఆడిషన్స్ చేసిన తర్వాత నేను చేయగలనని నమ్మారు. ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో చేశా. ఈ సినిమా చూస్తే... న్యూ ఏజ్ మూవీ. యూత్ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. నటుడిగా మంగళం పాత్ర చేసేటప్పుడు ఎంజాయ్ చేశా. మంగళం తెలంగాణ యాసలో మాట్లాడతాడు. నాకు ఏమో ఆంధ్ర యాస వస్తుంది. నేను రియల్ లైఫ్ ఫ్‌లో రిజర్వ‌డ్‌. మంగ‌ళం ఎక్స్రావ‌ర్ట్‌. అందువల్ల, ఈ పాత్ర చేయడం ఛాలెంజింగ్ అనిపించింది.  

ప్రశ్న: తెలంగాణ యాస నేర్చుకున్నారా?

రోహన్: ఎంఎస్ రాజు గారు ఫోన్ చేసి తెలంగాణ యాస అనగానే చేసేద్దాం అన్నాను. కానీ, లోపల చిన్న ఆందోళన ఉంది. నాకు స్నేహితుల్లో కొంత మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడటం, ఇటీవల తెలంగాణ నేపథ్యంలో వచ్చిన సినిమాలు చూడటం చేశా. అలా డైలాగులు ప్రాక్టీస్ చేశా. 

ప్రశ్న: హీరోయిన్‌తో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి...

రోహన్: మా సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఈజీగా కలిసిపోతారు. షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు ఎంఎస్ రాజు గారు ఆడిషన్స్ చేసినప్పుడు, ఆ తర్వాత కలిశాం. అందువల్ల, ఈజీగా చేశా. నాకు జోడీగా కృతికా శెట్టి నటించారు. మరో హీరోయిన్ పేరు మెహర్ చాహల్. ఇద్దరికీ ఇదే తొలి సినిమా.  

ప్రశ్న: యువతను ఆకట్టుకునే సినిమా అని ట్రైలర్లు చూస్తే తెలుస్తుంది. సందేశం ఏమైనా ఉందా?

రోహన్: సందేశం ఇచ్చే సన్నివేశాలు ఉన్నాయి. ఎక్కువ చెబితే... స్టోరీ రివీల్ అవుతుంది. పాఠం చెప్పినట్టు ఉండదు. కానీ, మెసేజ్ ఉంటుంది. 

ప్రశ్న: మీ తదుపరి సినిమా?

రోహన్: ఈ సినిమాకు వచ్చిన స్పందన బట్టి చూడాలి. రెండు మూడు చర్చల్లో ఉన్నాయి. నాకు ఎంఎస్ రాజు గారు మెంటార్. 

Roshan Interview:

Roshan Interview about 7 days 6 nights

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement