Advertisement

గణేష్ బెల్లంకొండ స్వాతిముత్యం రిలీజ్ డేట్ ఫిక్స్

Tue 14th Jun 2022 05:23 PM
bellamkonda ganesh,swathi muthyam,lakshman k krishna,sithara entertainments  గణేష్ బెల్లంకొండ స్వాతిముత్యం రిలీజ్ డేట్ ఫిక్స్
Swathi Muthyam Releasing In Theatres Worldwide On గణేష్ బెల్లంకొండ స్వాతిముత్యం రిలీజ్ డేట్ ఫిక్స్
Advertisement

గణేష్ బెల్లంకొండ హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం స్వాతిముత్యం. వర్ష బొల్లమ్మ ఈ చిత్ర కధానాయిక. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. 

ఈ చిత్రాన్ని ఆగస్టు 13 న విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు నిర్మాత సూర్య దేవర నాగవంశీ. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగా స్వాతిముత్యం ను దర్శకుడు తీర్చి దిద్దారు దర్శకుడు లక్ష్మణ్ అని తెలిపారు. 

దర్శకుడు మాటల్లో చెప్పాలంటే స్వాతిముత్యం లాంటి ఓ యువకుడు కథే ఈ చిత్రం. జీవితం, ప్రేమ, పెళ్లి పట్ల, ఆలోచనలు, అభిప్రాయాలు నడుమ అతని జీవిత ప్రయాణం ఎలా సాగిందన్నది ఈ చిత్రం. కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు తప్పనిసరి. ప్రధానంగా ఇవన్నీ వినోదాన్ని పుష్కలంగా పంచుతాయి. సగటు సినిమా ప్రేక్షకుడిని అలరిస్తాయి. 

ఇటీవల విడుదల అయిన స్వాతిముత్యం ప్రచార వీడియో చిత్రంవినోదమే ప్రధానంగా ఈ చిత్రం ఆద్యంతం రూపొందిందని, అందులోని  దృశ్యాలు చూసిన అందరికీ  అనిపించింది. వీడియో చిత్రం లోని సంభాషణలు  సైతం ఈ విషయాన్ని బలపరిచాయి. 

Swathi Muthyam Releasing In Theatres Worldwide On:

Bellamkonda Ganesh Swathi Muthyam Releasing In Theatres Worldwide On August 13th

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement