Advertisement

ఎఫ్ 3 ఫస్ట్ సింగిల్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు

Mon 07th Feb 2022 03:33 PM
venkatesh,varun tej,anil ravipudi,sri venkateswara creations,f3 movie,lab dab lab dab dabboo song  ఎఫ్ 3 ఫస్ట్ సింగిల్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు
F3 First Single Lab Dab Lab Dab Dabboo Out Now ఎఫ్ 3 ఫస్ట్ సింగిల్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు
Advertisement

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ క‌లిసి మోస్ట్ ఎవెయిటింగ్ ఫన్-ఫిల్డ్ ఎంటర్టైనర్ ఎఫ్‌3తో ఈ వేస‌వికి మూడు రెట్ల వినోదాన్ని అందించబోతోన్నారు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప‌తాకంపై శిరీష్ నిర్మిస్తున్నారు. థియేట‌ర్స్‌లో ప్రేక్ష‌కుల‌ని న‌వ్వుల‌లో ముంచెత్త‌డానికి ఏప్రిల్ 28న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది.

రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు ను విడుదల చేశారు. ఈ పాటలో డబ్బుకు ఉన్న శక్తి, గొప్పదనాన్ని వివరించారు. ఈ క‌థ డబ్బు చుట్టూ తిరుగుతుందన్న సంగతి తెలిసిందే.

ఈ పాట కోసం దేవీ శ్రీ ప్రసాద్ చక్కటి బాణీని సమకూర్చారు. రామ్ మిర్యాల గాత్రం, భాస్కర భట్ల సాహిత్యం పాటను మరింత అందంగా మలిచాయి. విజువల్‌గా కూడా ఈ పాట ఎంతో స్టైలీష్‌గా తెరకెక్కించినట్టు కనిపిస్తోంది.

శ్రోతలను ఈ పాట ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. వెంకటేష్, వరుణ్ తేజ్‌లు భిన్న గెటప్స్‌లో కనిపిస్తున్నారు. ఈ పాటలో తమన్నా కూడా కనిపిస్తున్నారు. పాట చివర్లో సినిమాలోని నటీనటులంతా కూడా డబ్బు రావాలని చేసే ప్రార్థనలు అందరికీ నవ్వు తెప్పించేలా ఉంది.

నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్, సునీల్ తో ఈ సినిమా మరింత వినోదాత్మకంగా మారనుంది. తమన్నా, మెహరీన్‌లు నవ్వించడమే కాకుండా, తమ అందంతో కట్టిపడేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంకాస్త గ్లామర్‌ను అద్దేందుకు సోనాల్ చౌహాన్ కూడా ఎంట్రీ ఇచ్చారు. వినోదం, గ్లామర్ ఇలా అన్ని రకాల కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

F3 First Single Lab Dab Lab Dab Dabboo Out Now:

Venkatesh, Varun Tej, Anil Ravipudi, Sri Venkateswara Creations F3 First Single Lab Dab Lab Dab Dabboo Out Now

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement