Advertisementt

సంక్రాంతి టార్గెట్ తో రౌడీ బాయ్స్

Sun 02nd Jan 2022 04:33 PM
rowdy boys,dil raju,asish,anuapama parameswaran,rowdy boys fixes,sankranti  సంక్రాంతి టార్గెట్ తో రౌడీ బాయ్స్
Rowdy Boys fixes the date on Sankranti సంక్రాంతి టార్గెట్ తో రౌడీ బాయ్స్
Advertisement
Ads by CJ

ఆర్.ఆర్.ఆర్ వాయిదాతో చిన్న సినిమాలకు ఊపొచ్చింది. అందుకే పొంగల్ ని క్యాష్ చేసుకునేందుకు బోలెడన్ని సినిమాలు సంక్రాంతి రేస్ లోకొచ్చేశాయి. అందులో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం రౌడీ బాయ్స్ కూడా ఉంది. తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచిగా త‌గిన‌ట్లు ఎన్నో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌ను అందించిన దిల్‌రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు ఆశిష్‌(శిరీష్ త‌న‌యుడు). ఈ చిత్రాన్ని సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా...

రౌడీ బాయ్స్‌ ప‌క్కా యూత్ కంటెంట్ మూవీ. ఆల్ రెడీ రౌడీ బాయ్స్ టైటిల్ ట్రాక్‌, ప్రేమే ఆకాశ‌మైతే అనే పాట‌లు విడుద‌లై మంచి రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకున్నాయి. అలాగే టీజ‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది.  కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే సినిమా. ఇందులో ల‌వ్ కంటెంట్ ఎలా ఉంటుంద‌నేది సినిమా చూడాల్సిందే. యూత్‌ఫుల్ మూవీ కావ‌డంతో దీనికి రౌడీ బాయ్స్ అనే టైటిల్ పెట్టాం. సంక్రాంతి సంద‌ర్భంగా రౌడీ బాయ్స్ ను విడుద‌ల చేస్తున్నాం. డైరెక్ట‌ర్ శ్రీహ‌ర్ష మంచి టీమ్‌తో యూత్ సహా అందరకీ నచ్చే ఓ ఎంటర్‌టైనింగ్ సినిమాను రూపొందించాడు. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ పెద్ద ఎసెట్ అవుతుందనడంలో సందేహం లేదు. దేవిశ్రీ మ్యూజిక్ ఇచ్చిన ఈ సినిమాలో పాటలకు వచ్చిన రెస్పాన్సే అందుకు ఎగ్జాంపుల్.  అనుప‌మ మా బ్యాన‌ర్లో చేసిన మూడో సినిమా. త‌ను కొత్త అమ్మాయిలా ఒదిగిపోయి యాక్ట్ చేసింది. మొదటి సినిమా అయినప్పటికీ ఫుల్ ఎనర్జీతో ఆశిష్ చేసిన డాన్సులు, ఫెర్ఫామెన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. అన్నీ ఎలిమెంట్స్‌తో రౌడీ బాయ్స్ యూత్‌ని మెప్పిస్తుంది అంటూ దిల్ రాజు సినిమాపై అంచనాలు పెంచేశారు.

Rowdy Boys fixes the date on Sankranti:

Rowdy Boys reelase date fix

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ