సుధీర్‌బాబు కొత్త మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mon 27th Dec 2021 05:06 PM
sudheer babu,harshavardhan,sree venkateswara cinemas llp,production no 5,sudheer babu new shoot begins today  సుధీర్‌బాబు కొత్త మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం
Sudheer Babu - Harshavardhan 5 Shoot Begins Today సుధీర్‌బాబు కొత్త మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం
Advertisement
Ads by CJ

హీరో సుధీర్ బాబు నటుడు, దర్శకుడు హర్ష వర్దన్ కాంబినేషన్‌లో రాబోతోన్న సినిమాను సోనాలి నారంగ్‌, సృష్టి స‌మ‌ర్ఫ‌ణ‌లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.5గా  నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు.

ఇటీవల ఈ సినిమాను ఘనంగా ప్రారంభించారు. నేడు ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను హైద్రాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభించారు. ఈ ఫస్ట్ షెడ్యూల్‌లో కీలక పాత్రధారులపై ముఖ్యమైన సన్నివేశాలను  చిత్రీకరించనున్నారు.

షూటింగ్ ప్రారంభం అంటూ చిత్రయూనిట్ ఓ వర్కింగ్ స్టిల్‌ను విడుదల చేశారు. ఇందులో సుధీర్ బాబు లుక్ పూర్తిగా రివీల్ కాలేదు. కానీ సుధీర్ బాబు మాత్రం ఇది వరకు ఎన్నడూ కనిపించని లుక్‌లో అందరినీ ఆశ్చర్యపరచ

బోతోన్నట్టు తెలుస్తోంది.

సుధీర్ బాబు కెరీర్‌లో 15వ సినిమాగా రాబోతోన్న ఈ మూవీలో ఛాలెంజింగ్ పాత్రను పోషించనున్నారు. సుధీర్ బాబు కోసం ఒక భిన్న‌మైన క‌థ‌ను రెడీ చేశారు ద‌ర్శ‌కుడు హ‌ర్ష వ‌ర్ధ‌న్‌. ఈ సినిమాలో ఇంత వ‌ర‌కూ చూడ‌ని స‌రికొత్త అవతారంలో సుధీర్ బాబు క‌నిపించ‌నున్నారు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంతో ప్రముఖ నటీనటులు, సాంకేతిక బృందం భాగస్వామ్య కానున్నారు.

చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా పీజీ విందా సినిమాటోగ్ర‌ఫి భాధ్య‌తలు  నిర్వ‌హిస్తున్నారు. రాజీవ్ ఆర్ట్ డైరెక్ట‌ర్. ఇత‌ర న‌టీన‌టులు సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లో తెలుప‌నున్నారు.

Sudheer Babu - Harshavardhan 5 Shoot Begins Today:

Sudheer Babu, Harshavardhan, Sree Venkateswara Cinemas LLP Production No 5 Shoot Begins Today

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ