సామాన్యుడు థీమ్ మ్యూజిక్ విడుదల

విశాల్, తు ప శరవణన్, వీఎఫ్ఎఫ్ సామాన్యుడు నుంచి థీమ్ మ్యూజిక్ విడుదల

విశాల్ సామాన్యుడు చిత్రంతో తు ప శరవణన్ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ యాక్షన్ డ్రామాకు నాట్ ఏ కామన్ మ్యాన్ అనేది ఉపశీర్షికగా ఫిక్స్ చేశారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద ఈ సినిమాను విశాల్ నిర్మిస్తున్నారు. విశాల్ గత చిత్రాలకు పని చేసి ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చిన యువన్ శంకర్ రాజా సామాన్యుడు సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చనున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి థీమ్ మ్యూజిక్‌ను విడుదల చేశారు. ఇందులోని లిరిక్స్ ఎంతో స్పూర్తివంతంగా ఉన్నాయి. ఈ పాటను నివేదిత ఆలపించారు.

డింపుల్ హయతి ఈ చిత్రంలో విశాల్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారు. యోగిబాబు, బాబురాజ్ జాకబ్, పా తులసి, రవీనా రవి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తుండగా.. కెవిన్ రాజా సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు.

నటీనటులు: విశాల్, డింపుల్ హయతి, యోగిబాబు, బాబురాజ్ జాకబ్, పా తులసి, రవీనా రవి

సాంకేతిక బృందం: డైరెక్టర్: తు ప శరవణన్, నిర్మాత: విశాల్, సంగీతం: యువన్ శంకర్ రాజా, డీఓపీ: కెవిన్ రాజా, ఎడిటర్: ఎన్ బి శ్రీకాంత్, ఆర్ట్: ఎస్ఎస్ మూర్తి, కాస్ట్యూమ్ డిజైనర్: వాసుకి భాస్కర్, పీఆర్వో: వంశీ శేఖర్, పబ్లిసిటీ డిజైన్: విక్రమ్ డిజైన్స్.

Samanyudu which will be arriving in theatres on January 26th

Saamanyudu Theme Music Out
saamanyudu
vishal
saamanyudu movie
saamanyudu theme music
thu pa saravanan
yuvan shankar raja
dimple hayathi
yogi babu
baburaj jacob
p.a.tulasi
raveena ravi