Advertisement

ఆహాలో రొమాంటిక్‌

Wed 17th Nov 2021 11:52 AM
aha,aha ott,akash puri,ketika sharma,romantic,november 26  ఆహాలో రొమాంటిక్‌
Aha to premiere Romantic, on November 26 ఆహాలో రొమాంటిక్‌
Advertisement

100 పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహా ఇప్పుడు తెలుగు వారి ఇంట ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో భాగ‌మైంది. ఈ మాధ్య‌మం అందిస్తున్న చిత్రాల్లో ఆకాశ్ పూరి, కేతికా శ‌ర్మ జంట‌గా న‌టించిన యాక్ష‌న్‌, రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ రొమాంటిక్‌ న‌వంబ‌ర్ 26న ప్రేక్షకుల‌ను మెప్పించ‌నుంది. ఈ సినిమాకు క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌ల‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ అందించారు.  అనీల్ పడూరి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. ఆకాశ్ పూరి, కేతికా శ‌ర్మ‌ల‌తో పాటు సూప‌ర్బ్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ పెర్ఫామెన్స్ సినిమాకు మెయిన్ హైలైట్ . వీటితో పాటు ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్‌, షార్ప్ స్క్రీన్‌ప్లే, సునీల్ క‌శ్య‌ప్ అందించిన అద్భుత‌మైన సంగీతం ఆడియెన్స్‌ను అల‌రిస్తాయి. 

రొమాంటిక్ సినిమా ప్రేక్ష‌కుల‌కు గోవాలోని వాస్కోడిగామా అనే 21 ఏళ్ల కుర్రాడి క‌థ‌. గోవాలో జ‌రిగే నేరాల‌కు పోలీసులు వ‌ల్ల‌ అత‌న్ని ఇబ్బంది ప‌డుతుంటాడు కూడా. వాస్కోడిగామా సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఓ మంచి జీవితాన్ని గ‌డ‌పాల‌ని అత‌ని స‌ల‌హాలు ఇస్తుంటారు. కానీ అత‌ని జీవితంలో స‌మ‌స్య‌లే ఎక్కువ‌గా వ‌స్తుంటాయి. త‌నొక గ్యాంగ్‌స్ట‌ర్‌గా మారుతాడు. పోలీస్ ఆఫీస‌ర్ చెల్లెలు మోనిక‌తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఇద్ద‌రివి విరుద్ధ‌మైన ప్ర‌పంచాలు అయినా కూడా ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ పుడుతుంది. ఏసీపీ ర‌మ్యా గోవార్క‌ర్ వారి ప్రేమ‌కు ఫుల్‌స్టాప్ పెట్ట‌డానికి వ‌స్తుంది. 

రొమాంటిక్ యాక్ష‌న్‌. రొమాంటిక్ స‌న్నివేశాల‌తో ప్రేక్ష‌కుల‌ను ఎంగేజ్ చేస్తుంది. ఆకాశ్ పూరి, కేతికా శ‌ర్మ మ‌ధ్య అద్బుత‌మైన కెమిస్ట్రీ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకుంటుంది. దీంతో పాటు గ్యాంగ్‌స్ట‌ర్స్ క‌థ‌నాన్ని కూడా సినిమాలో పూరీ జ‌గ‌న్నాథ్ భాగం చేశారు. యాక్ట‌ర్ ఉత్తేజ్‌తో సునైన కామెడీ ప్రేక్ష‌కుల‌ను న‌వ్విస్తుంది. సునీల్ క‌శ్య‌ప్ సంగీతం సినిమాను మ‌రో లెవ‌ల్‌కు తీసుకెళ్లింది. ఆయ‌న అందించిన పాట‌లు, నేప‌థ్య సంగీతం సినిమా చూసే ప్రేక్ష‌కుడి మూడ్‌ను క్యారీ చేస్తుంది. స‌తీశ్ సారిప‌ల్లి, సీనియ‌ర్ న‌టి ర‌మా ప్ర‌భ‌, ముఖేష్ దేశ్‌పాండే ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో మెప్పించారు. 

తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో భాగ‌మైన ఆహా న‌వంబ‌ర్ 26న ఆహాలో  ప్రీమియ‌ర్ కానుంద‌నే సంగ‌తి మ‌ర‌చిపోకండి. 2021లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు - షోలు.... ల‌వ్‌స్టోరీ, క్రాక్‌, లెవ‌న్త్ హ‌వ‌ర్‌, జాంబీ రెడ్డి, చావు క‌బురు చ‌ల్ల‌గా,  అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే, నాంది, 3రోజెస్‌, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్‌, నీడ‌, కాలా, ఆహా భోజ‌నంబు, ఒన్‌, సూప‌ర్ డీల‌క్స్, చ‌తుర్ముఖం, త‌ర‌గ‌తిగ‌దిదాటి, ది బేక‌ర్ అండ్ ది బ్యూటీ, మ‌హా గ‌ణేష‌, స‌ర్కార్‌, ప‌రిణ‌య‌మ్‌, ఒరేయ్ బామ్మ‌ర్ది, కోల్డ్ కేస్‌, అల్లుడు గారు, ఇచ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు వంటివాటికి కేరాఫ్ ఆహా. ప్రేక్ష‌కులు ఆహాలో వీటిని చూసి ఆస్వాదించ‌వ‌చ్చు.

Aha to premiere Romantic, on November 26:

Aha to premiere Akash Puri, Ketika Sharma action-romance, Romantic, on November 26

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement