Advertisement

ఆహాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌

Tue 16th Nov 2021 08:50 PM
aha,aha ott,akhil akkineni,pooja hegde,blockbuster romantic entertainer,most eligible bachelor,november 19  ఆహాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌
Aha to premiere Akhil Akkineni Most Eligible Bachelor on November 19 ఆహాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌
Advertisement

అచ్చ తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ ఆహా, అస‌లు సిస‌లైన తెలుగు వినోదానికి ఇంటికి పేరు. న‌వంబ‌ర్ 19 నుంచి ఆహా అందిస్తోంది బ్లాక్ బ‌స్ట‌ర్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే న‌టించిన ఈ సినిమాను బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ తెర‌కెక్కించారు.

అత్యంత అద్భుత‌మైన పెర్ఫార్మెన్స్ లు, మోడ్ర‌న్ డేస్ రిలేష‌న్‌షిప్స్ మీద ఫోక‌స్ అయిన క‌థ‌, మ‌న‌సును ట‌చ్ చేసే గోపీసుంద‌ర్ మ్యూజిక్‌... థియేట‌ర్ల‌లో జ‌నాల‌తో ఆహా అనిపించుకుంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌. సినిమా రిలీజ్ అయ్యీ కాగానే విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు, హౌస్ ఫుల్ క‌లెక్ష‌న్స్ తో పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేసింది. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను ఆహాలో రిపీట్ చేయ‌డానికి రెడీ అవుతోంది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ సినిమా కోసం ఆహా క‌ట్ చేసిన లేటెస్ట్ ట్రైల‌ర్ మూవీ బ‌ఫ్స్ మ‌ధ్య ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇందులో అఖిల్ హ‌ర్ష అనే కేర‌క్ట‌ర్ చేశాడు. రెండు ప‌దులు దాటిన వ‌య‌సున్న యంగ్‌స్ట‌ర్ హ‌ర్ష‌. త‌నకు స‌రైన జోడీని వెతుక్కుంటూ శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఇండియాకు వ‌స్తాడు. అన్నీ అనుకున్న‌ట్టే జ‌రిగినా, పెళ్లికూతురు మాత్రం అత‌ని అభిరుచుల‌కు అనుగుణంగా దొర‌క‌దు. అలాంటి స‌మయంలో అత‌నికి విభ‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. జీవితాన్ని ఆస్వాదించే హ్యాపీ గో ల‌క్కీ స్టాండ‌ప్ క‌మెడియన్ విభ‌. ఆమె ప‌రిచ‌యం అయ్యాక హ‌ర్ష‌, జీవితాన్ని చూసే తీరే మారిపోతుంది. ప్రేమ గురించి, బంధాల గురించి అప్ప‌టిదాకా అత‌ని మ‌న‌సులో ఉన్న అభిప్రాయాలు మారుతాయి. ఇంత‌కీ, హ‌ర్ష - విభ జంట క‌లిసిందా?  లేదా అనేది ఆస‌క్తిక‌రం.

ఈ సినిమా ట్రైల‌ర్ లాంచ్‌, ప్రీమియ‌ర్ అనౌన్స్ మెంట్ హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఫీమేల్ స్టాండ‌ప్ క‌మెడియ‌న్స్ తో పాటు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ న‌టీన‌టులు, టెక్నీషియ‌న్లు కూడా పాల్గొని ఆడియ‌న్స్ ని ఎంట‌ర్‌టైన్ చేశారు. ఆధునిక జీవితంలో చాలా మంది ఫేస్ చేస్తున్న రిలేష‌న్‌షిప్ ఇష్యూస్‌ని సెన్సిటివ్‌గా డీల్ చేసిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌. అందులో వినోదం పాళ్లు కూడా ఎక్కువే. సంగీతం కూడా సినిమాకు అత్యంత పెద్ద ప్లస్ పాయింట్‌. ఆమ‌ని, ముర‌ళీశ‌ర్మ‌, జ‌య‌ప్ర‌కాష్‌, గెట‌ప్ శీను, సుడిగాలి సుధీర్‌, ప్ర‌గ‌తి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

ఇందులో ఈషారెబ్బా, ఫ‌రియా అబ్దుల్లా, శాన్వీ మేఘ‌న‌, రియ‌ల్ లైఫ్ క‌పుల్ రాహుల్ ర‌వీంద్ర‌న్‌- చిన్మ‌యి స్పెష‌ల్ అప్పియ‌రెన్సులు ఆక‌ట్టుకుంటాయి. ప్ర‌దీప్ వ‌ర్మ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు క్లాసీ ఔట్‌లుక్ ఇవ్వ‌డంతో పాటు, సినిమా మూడ్‌ని అద్భుతంగా క్యారీ చేసింది.

అన్నిటినీ మ‌ర్చిపోయి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ మ్యాజిక‌ల్ వ‌ర‌ల్డ్ లోకి న‌వంబ‌ర్ 19న ప్ర‌వేశించేయండి అని ఆహ్వానిస్తోంది ఆహా. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ మాత్ర‌మే కాదు 2021లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు - షోలు.... ల‌వ్‌స్టోరీ, క్రాక్‌, లెవ‌న్త్ హ‌వ‌ర్‌, జాంబీ రెడ్డి, చావు క‌బురు చ‌ల్ల‌గా,  అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే, నాంది, 3రోజెస్‌, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్‌, నీడ‌, కాలా, ఆహా భోజ‌నంబు, ఒన్‌, సూప‌ర్ డీల‌క్స్, చ‌తుర్ముఖం, త‌ర‌గ‌తిగ‌దిదాటి, ది బేక‌ర్ అండ్ ది బ్యూటీ, మ‌హా గ‌ణేష‌, స‌ర్కార్‌, ప‌రిణ‌య‌మ్‌, ఒరేయ్ బామ్మ‌ర్ది, కోల్డ్ కేస్‌, అల్లుడు గారు, ఇచ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు వంటివాటికి కేరాఫ్ ఆహా. ప్రేక్ష‌కులు ఆహాలో వీటిని చూసి ఆస్వాదించ‌వ‌చ్చు.

Aha to premiere Akhil Akkineni Most Eligible Bachelor on November 19:

Aha to premiere Akhil Akkineni, Pooja Hegde blockbuster romantic entertainer Most Eligible Bachelor on November 19

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement