Advertisementt

రావ‌ణ‌లంక ట్రైల‌ర్

Fri 22nd Oct 2021 06:59 PM
ravanalanka,ravanalanka movie,ravanalanka trailer,manchu vishnu  రావ‌ణ‌లంక ట్రైల‌ర్
Ravanalanka Trailer రావ‌ణ‌లంక ట్రైల‌ర్
Advertisement
Ads by CJ

మా అధ్య‌క్షులు, ప్ర‌ముఖ స్టార్ హీరో మంచు విష్ణు చేతులు మీదుగా విడుద‌లైన రావ‌ణ‌లంక ట్రైల‌ర్

రియ‌ల్ ఎస్టేట్‌ రంగంలో ఎంతోమందికి ఉపాధి క‌ల్పించి వ్యాపార‌వేత్త‌గా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సాధించి, ఇప్పుడు సినీ రంగంలోకి రావ‌ణ‌లంక చిత్రంతో హీరోగా నిర్మాత‌గా అడుగు పెడుతున్నారు క్రిష్ బండిప‌ల్లి. కే సిరీస్ మూవీ ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి బిఎన్ఎస్ రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. క్రిష్ స‌ర‌స‌న అస్మిత కౌర్ భ‌క్షి హీరోయిన్ గా న‌టించారు. ఈ సినిమాకు సంబంధించిన ప‌బ్లిసిటీ కంటెంట్ ఇప్ప‌టికే విడుద‌లై అనూహ్య స్పంద‌న అందుకోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ప్ర‌ముఖ స్టార్ హీరో, మా అధ్య‌క్ష‌లు మంచు విష్ణు చేతులు మీదుగా రావ‌ణలంక ట్రైల‌ర్ ని విడుద‌లైంది. ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా అటు మాస్ ఆడియెన్స్ ని ఇటు క్లాస్ ఆడియెన్స్ ని ఆక‌ట్టుకునే విధంగా ఈ సినిమా ఉండ‌బోతుంద‌నే రీతిన ఈ ట్రైలర్ ని రెడీ చేశారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అక్టోబ‌ర్ 29న భారీ రేంజ్ లో ఈ చిత్రాన్ని థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తున్న‌ట్లుగా రావ‌ణ‌లంక నిర్మాత‌, హీరో క్రిష్ తెలిపారు. ఈ సినిమాలో ప్ర‌ముఖ న‌టులు ముర‌ళి శ‌ర్మ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సినిమా ఆడియో విడుద‌లైంది.

న‌టీన‌టులు: క్రిష్ బండిప‌ల్లి, అశ్మిత కౌర్ భ‌క్షి, ముర‌ళిశర్మ‌, ర‌చ్చ‌ర‌వి, దేవ్ గిల్. బ్యాన‌ర్ - కే సిరీస్ మూవీ ఫ్యాక్ట‌రీ, ద‌ర్శ‌క‌త్వం - బిఎన్ఎస్ రాజు, నిర్మాత - క్రిష్ బండిప‌ల్లి, మ్యూజిక్ - ఉజ్జ‌ల కుమార్ సాహా, కెమెరా - హ‌జ‌ర్ తాహై షేక్, ఎడిట‌ర్ - వినోద్.

Ravanalanka Trailer:

Ravanalanka Trailer

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ