Advertisementt

Ads by CJ

వరుణ్ డాక్టర్ చూసినప్పుడు ఆడియన్స్ ఎగ్జైట్ అవుతారు -హీరో శివ కార్తికేయన్

Thu 07th Oct 2021 06:16 PM
varun doctor,varun doctor movie,varun doctor movie pre-release event,shiva karthikeyan,priyanka arul mohan  వరుణ్ డాక్టర్ చూసినప్పుడు ఆడియన్స్ ఎగ్జైట్ అవుతారు -హీరో శివ కార్తికేయన్
Varun Doctor Movie Pre-release event వరుణ్ డాక్టర్ చూసినప్పుడు ఆడియన్స్ ఎగ్జైట్ అవుతారు -హీరో శివ కార్తికేయన్
Advertisement
Ads by CJ

వరుణ్ డాక్టర్ చూసినప్పుడు ఆడియన్స్ ఎగ్జైట్ అవుతారు -హీరో శివ కార్తికేయన్ 

రెమో, సీమ రాజా, శక్తి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్‌. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం వరుణ్‌ డాక్టర్‌. ఇప్పుడు తమిళ స్టార్‌ హీరో విజయ్‌ బీస్ట్‌ కు దర్శకత్వం వహిస్తున్న నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ తెరకెక్కించిన చిత్రమిది. కె.జె.ఆర్‌. స్టూడియోస్‌ అధినేత కోటపాడి జె. రాజేష్‌.. గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎస్‌.కె. ప్రొడక్షన్స్‌తో సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయదశమి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్‌ 9న డాక్టర్‌ విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. 

ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా హాజరైన ప్ర‌ముఖ నిర్మాత‌లు ఏసియ‌న్ సునీల్‌, సుధాక‌ర్‌ రెడ్డి, ఠాగూర్ మ‌ధు వ‌రుణ్ డాక్ట‌ర్ బిగ్ టికెట్‌ను ఆవిష్క‌రించారు. అనంతరం సినిమా భారీ విజయం సాధించాలని ఆకాంక్షించారు. హీరో శివ కార్తికేయన్, దర్శక-నిర్మాతలకు ఆల్ ద బెస్ట్ చెప్పారు.  

హీరో శివ కార్తికేయన్ మాట్లాడుతూ థియేటర్లలో ప్రేక్షకుల ఈలలు, చప్పట్లు నాకు మోటివేషన్. రెండేళ్లుగా వాటిని మిస్ అవుతున్నా. ఇక్కడ హైదరాబాద్‌లో, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మీ చప్పట్లు, ఈలలు వింటుంటే చాలా సంతోషంగా ఉంది. అక్టోబర్ 9న డాక్టర్ తో థియేటర్లలోకి వస్తున్నాను. వరుణ్ డాక్టర్ ట్రైల‌ర్‌కు మంచి స్పందన లభించింది. తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖులు మా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావడం సంతోషంగా ఉంది. సుధాకర్ రెడ్డిగారికి థాంక్స్. ట్రైలర్ విడుదల చేసిన  హీరో నితిన్‌కు స్పెషల్ థాంక్స్. ఇక్కడికి విచ్చేసిన ఠాగూరు మధుగారికి థాంక్స్. సునీల్ గారితో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. త్వరలో అదేంటో వెల్లడిస్తాం. వరుణ్ డాక్టర్ సినిమాలో డాక్టర్ వరుణ్ పాత్రలో నటించాను. నాకు ఈ క్యారెక్టర్ చాలా కొత్త. రెమో చూశారు కదా! అందులో నేను నర్స్. ఇందులో డాక్టర్. రెమో లో ప్రేమించడం తప్ప నర్స్ ఏమీ చేయలేదు. ఈ సినిమాలో డాక్టర్ డిఫరెంట్ ఆపరేషన్స్ చేశాడు. ఇందులో నటించినప్పుడు, సినిమా చూసినప్పుడు కొత్తగా అనిపించింది. సినిమా చూసినప్పుడు ఆడియన్స్ కూడా అంతే ఎగ్జైట్మెంట్ ఫీలవుతారని ఆశిస్తున్నాను. తెలుగులో భారీ ఎత్తున సినిమా విడుదల చేస్తున్న గంగ ఎంటర్టైన్మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డిగారికి థాంక్స్. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఇక్కడికి రావాలని అనుకున్నాడు. సినిమా పనుల్లో ఉండటం వలన రాలేకపోయాడు. నేను వస్తే సినిమా రాదు. సరేనా? అని అడిగాడు. వద్దు అని చెప్పా. అనిరుధ్ తరఫున ప్రేక్షకులకు థాంక్స్. కంటెంట్ బావుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. సినిమాకు ఎల్లలు లేవు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. అందరూ థియేటర్లకు వెళ్లి చూడండి. మాస్క్ ధరించి, శానిటైజర్ రాసుకుని.. సేఫ్‌గా సినిమా చూడండి. ఎంజాయ్ చేయండి అని అన్నారు.

దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. సినిమాలో చాలా ఎంటర్టైన్మెంట్, ఫన్ ఉంది. వెరీ ఎంగేజింగ్ ఫిల్మ్. ఈ నెల 9న థియేటర్లలో చూడండి. ట్రైలర్‌కు తెలుగులోనూ రెస్పాన్స్ అదిరింది. అందరికీ థాంక్స్. మా డాక్టర్ మంచోడా? చెడ్డోడా? వంటి ప్రశ్నలకు 9న థియేటర్లలో ఆన్సర్ లభిస్తుంది. సినిమా చూడండి. విజయ్ హీరోగా చేస్తున్న బీస్ట్ గురించి డాక్టర్ విడుదల తర్వాత మాట్లాడతా అని అన్నారు.

గంగ ఎంటర్టైన్మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పాటలు, ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై అంచనాలు పెంచాయి. అంచనాలను అందుకునే విధంగా వరుణ్ డాక్టర్ ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే న్యూ ఏజ్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో యాక్షన్, థ్రిల్స్, కామెడీ, మంచి కథ, కథనం ఉన్నాయి అని అన్నారు.

హీరోయిన్ ప్రియాంకా అరుల్ మోహన్ మాట్లాడుతూ నాకు డాక్టర్ చాలా స్పెషల్ ఫిల్మ్. ఒక రెగ్యులర్ సినిమాలా ఉండదు. కథ, క్యారెక్టర్లు అన్నీ కొత్తగా ఉంటాయి. ఇది న్యూ ఏజ్ సినిమా అని చెబుతాను. ఇందులో నటించే అవకాశం వచ్చినందుకు గర్వంగా, సంతోషంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు నెల్సన్‌కు థాంక్స్. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో అక్టోబర్ 9న థియేటర్లలో సినిమా చూడండి. ఎంజాయ్ చేయండి అని అన్నారు. 

శివ కార్తికేయన్, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటించిన ఈ చిత్రంలో వినయ్ రాయ్ విలన్. యోగి‌ బాబు, మిళింద్ సోమన్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి మాటలు: రాజేష్ ఏ మూర్తి, పాటలు: రాజశ్రీ సుధాకర్, శ్రీనివాస మూర్తి, కూర్పు: ఆర్. నిర్మల్, కెమెరా: విజయ్ కార్తీక్ కణ్ణన్, సంగీతం: అనిరుధ్, నిర్మాత: కోటపాడి జె. రాజేష్, రచన దర్శకత్వం: నెల్సన్ దిలీప్ కుమార్.

Varun Doctor Movie Pre-release event:

Varun Doctor Movie Pre-release event

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ