Advertisement

బాగా ఖ‌ర్చు పెట్టి చేశారు -విజ‌య్ ఆంటోని

Mon 13th Sep 2021 07:00 PM
vijaya raghavan,vijaya raghavan movie,vijaya raghavan movie stills,vijaya raghavan movie pre-release event  బాగా ఖ‌ర్చు పెట్టి చేశారు -విజ‌య్ ఆంటోని
Vijaya Raghavan movie pre-release event బాగా ఖ‌ర్చు పెట్టి చేశారు -విజ‌య్ ఆంటోని
Advertisement

కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి చూసేలా రూపొందిన క‌మ‌ర్షియ‌ల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ విజ‌య రాఘ‌వ‌న్‌ త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంది: ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజ‌య్ ఆంటోని

న‌కిలీ, డా.సలీమ్‌, బిచ్చగాడు, భేతాళుడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్‌ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో విజయ్‌ ఆంటోని. ఈయన హీరోగా.. మెట్రో వంటి డిఫరెంట్‌ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్‌ ఆనంద కృష్ణన్‌ తెరకెక్కించిన‌ చిత్రం విజయ రాఘవన్‌. ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్‌ సమర్పణలో చెందూర్ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై టి.డి.రాజా, డి.ఆర్‌.సంజయ్‌ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కోడియిల్ ఒరువ‌న్‌ పేరుతో త‌మిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీకరి ఫిలింస్ బ్యానర్‌పై ర‌విచంద్రా రెడ్డి, శివారెడ్డి తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. విజ‌య రాఘ‌వ‌న్‌ పేరుతో తెలుగులో సెప్టెంబ‌ర్ 17న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా  ఆదివారం హైద‌రాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో బిగ్ టిక్కెట్‌ను ఆవిష్క‌రించారు. 

ఈ సంద‌ర్భంగా.. రైట‌ర్ భాష్య‌శ్రీ మాట్లాడుతూ.. ఈ సినిమాకు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌, అనువాదంలో వ‌ర్క్ చేసిన అంద‌రూ సినిమా గ్యారంటీ హిట్ అని చెప్పారు. క‌చ్చితంగా సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఈ సినిమాలో ప‌నిచేసే అవ‌కాశం ఇచ్చినందుకు థాంక్స్‌. ఈ సినిమాలో విజ‌య రాఘ‌వ‌న్‌గా న‌టించిన విజ‌య్ ఆంటోనిగారు ఓ ట్యూష‌న్ మాస్ట‌ర్‌. త‌న అమ్మ క‌న్న క‌ల‌ను నేర‌వేర్చ‌డానికి ఓ ప్రాంతానికి వ‌స్తాడు. ఆయ‌న పాత్ర‌లో చాలా డైమ‌న్ష‌న్స్ ఉంటాయి. చాలా విభిన్నంగా ఉండే సినిమా అన్నారు. 

మ్యూజిక్ డైరెక్ట‌ర్ నివాస్ కె.ప్ర‌స‌న్న మాట్లాడుతూ.. మంచి క‌థ‌కు త‌గ్గ సాంగ్స్ కుదిరాయి. అవ‌కాశం ఇచ్చిన విజ‌య్ ఆంటోనిగారికి, దర్శక నిర్మాతలకు థాంక్స్ అన్నారు. 

శ్రీకరి ఫిలింస్ అధినేతలు ర‌విచంద్రా రెడ్డి, శివారెడ్డి మాట్లాడుతూ.. విజయ్ ఆంటోనిగారికి థాంక్స్‌. ఆనంద్ కృష్ణ‌న్‌గారు అద్భుత‌మైన క‌థ‌తో సినిమా చేశారు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. సినిమాపై కాన్ఫిడెన్స్‌గా ఉన్నాం. సెప్టెంబ‌ర్ 17న విడుద‌ల‌వుతున్న మా సినిమాను థియేట‌ర్స్‌లో చూసి ఎంజాయ్ చేయాల‌ని కోరుకుంటున్నాం అన్నారు. 

చిత్ర దర్శకుడు ఆనంద కృష్ణ‌న్ మాట్లాడుతూ.. దర్శకుడిగా నా తొలి చిత్రం మెట్రో తెలుగులో విడుదలై మంచి ఆదరణను దక్కించుకుంది. ఇది నా రెండో సినిమా. ఇది కూడా తెలుగులో భారీగా విడుదలవుతుండటం హ్యాపీగా ఉంది. తెలుగులో గ్రాండ్‌గా సినిమా విడుద‌ల‌వుతుంది. ఐఏఎస్ ఆఫీస‌ర్ కావాల‌నుకునే ఓ యువ‌కుడి క‌థే ఇది. జీవితంలో ఎన్నో సాధించాల‌నుకునే హీరో, త‌న త‌ల్లి కోరిక‌ను తీర్చాల‌నుకుంటాడు. ఆ క్ర‌మంలో కొన్ని స‌మ‌స్య‌ల్లో చిక్కుకుంటాడు. వాటి నుంచి త‌నెలా బ‌య‌ట‌ప‌డ‌తాడు అనేదే ఈ చిత్రం. ఇదొక ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. అంతే కాకుండా.. స‌మాజంలో మ‌న‌కు ఎదుర‌య్యే రాజ‌కీయ ప‌ర‌మైన ఇబ్బందులను ఎలా హ్యాండిల్ చేయాల‌నే సందేశం కూడా ఇస్తుంది. ఇలాంటి ఓ సినిమాను చేసే అవ‌కాశం ఇచ్చిన నిర్మాత‌లకు, విజ‌య్ ఆంటోనిగారికి థాంక్స్‌. నివాస్ చాలా మంచి సంగీతాన్ని అందించారు. హీరోయిన్ ఆత్మిక చాలా మంచి రోల్‌ను క్యారీ చేసింది. సెప్టెంబ‌ర్ 17న విడుద‌ల‌వుతున్న సినిమాను ఆద‌రించండి అన్నారు. 

రామచంద్రరాజు మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17న విజయ రాఘవన్ థియేటర్స్‌లో విడుద‌ల‌వుతుంది. మంచి సినిమా. దాన్ని థియేట‌ర్స్‌లో చూసి ఎంక‌రేజ్ చేయండి. ఆనంద కృష్ణ‌న్‌, విజ‌య్ ఆంటోనిగారికి, నిర్మాత‌ల‌కు థాంక్స్‌ అన్నారు. 

ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్ క‌మ‌ల్ మాట్లాడుతూ.. విజయ్ రాఘవన్ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డ్డాం. సెప్టెంబ‌ర్ 17న థియేట‌ర్స్‌లో మెప్పించ‌డానికి రాబోతున్నాం. ప్రేక్ష‌కులు సినిమాను స‌క్సెస్ చేయాల‌ని కోరుకుంటున్నాం అన్నారు. 

హీరోయిన్ ఆత్మిక మాట్లాడుతూ..మంచి సినిమాలను తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆద‌రిస్తారు. అలాంటి ఓ మంచి మూవీ విజ‌య రాఘ‌వ‌న్ సెప్టెంబ‌ర్ 17న మీ ముందుకు రాబోతుంది. సినిమాను థియేట‌ర్స్ చూసి విజ‌యాన్ని అందించండి. సినిమా త‌ప్ప‌కుండా మిమ్మ‌ల్ని మెప్పిస్తుంది అన్నారు. 

హీరో విజ‌య్ ఆంటోని మాట్లాడుతూ.. కిల్లర్ సినిమా తర్వాత ప్యాండ‌మిక్ కార‌ణంగా తెలుగు ప్రేక్ష‌కుల‌ను క‌లుసుకునే అవ‌కాశ‌మే లేకుండా పోయింది. ఈ గ్యాప్ త‌ర్వాత విజ‌య రాఘ‌వన్ వంటి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుండ‌టం హ్యాపీగా ఉంది. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ ఆనంద కృష్ణ‌న్ సినిమాను తెర‌కెక్కించారు. ఆయ‌న ఇంత‌కు ముందు మెట్రో అనే సినిమాను తెర‌కెక్కించారు. చాలా మంచి ద‌ర్శ‌కుడు. విజ‌య రాఘ‌వ‌న్ సినిమాను నిర్మించిన రాజాగారు, క‌మ‌ల్‌గారు, ప్ర‌దీప్‌గారికి, ధ‌నంజ‌య‌న్‌గారికి ఇత‌రుల‌కు థాంక్స్‌. బాగా ఖ‌ర్చు పెట్టి ఓ మంచి క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేశారు. అలాగే తెలుగులో సినిమాను విడుద‌ల చేస్తున్న శ్రీక‌రి ఫిలింస్ ర‌విచంద్రా రెడ్డి, శివారెడ్డిల‌కు థాంక్స్‌, అభినంద‌న‌లు. ఓ ఎడిట‌ర్‌గా కూడాఈ సినిమాను చాలా సార్లు చూశాను. సినిమాలో చాలా ఎమోష‌న్స్ ఉన్నాయి. ప్రేక్ష‌కుల‌ను సినిమా డిస్పాయింట్ చేయ‌దు. బిచ్చ‌గాడు ఓ అమ్మ‌క‌థ అయితే, విజ‌య రాఘ‌వ‌న్ ఓ అమ్మ క‌ల‌ను నేర‌వేర్చే చిత్రం. అంద‌రూ మీ ఫ్యామిలీతో క‌లిసి చూడొచ్చు. నివాస్ ప్ర‌స‌న్న అద్భుత‌మైన సంగీతాన్నిఅందించారు. త‌న‌తో మ‌రిన్ని సినిమాలు చేయాల‌ని అనుకున్నాను. రామ‌చంద్ర‌ రాజుగారికి థాంక్స్‌. భాష్య‌శ్రీ గారు మంచి సంభాష‌ణ‌లు, పాట‌లు అందించారు. సినిమా త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది అన్నారు. 

న‌టీన‌టులు: విజయ్‌ ఆంటోని, ఆత్మిక, రామచంద్రరాజు, ప్రభాకర్ తదితరులు.

సాంకేతిక వ‌ర్గం: రచన, దర్శకత్వం: ఆనంద కృష్ణన్‌, నిర్మాతలు: టి.డి.రాజా, డి.ఆర్‌. సంజయ్‌ కుమార్‌,  సహ నిర్మాతలు: కమల్ బోరా, లలిత ధనంజయన్‌, బి.ప్రదీప్‌, పంకజ్‌ బోరా, ఎస్‌.విక్రమ్‌ కుమార్‌, సినిమాటోగ్రఫీ: ఎన్‌.ఎస్‌.ఉదయ్‌కుమార్‌, మ్యూజిక్‌: నివాస్‌ కె.ప్రసన్న, ఎడిటర్‌: లియో జాన్‌ పాల్‌.

Vijaya Raghavan movie pre-release event:

pre-release event of Vijay Anthony Vijaya Raghavan movie

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement