షకలక శంకర్ కార్పొరేటర్ ట్రైలర్

అందరి మన్ననలు పొందుతూ సంచలనం సృష్టిస్తున్న కార్పొరేటర్ ట్రైలర్  

సమీప మూవీస్ మరియు యు & ఐ స్టూడియోస్ పతాకాలపై హాస్య నటుడు షకలక శంకర్, సునీత పాండే, లావణ్య శర్మ, కస్తూరి హీరో,హీరోయిన్లు గా సంజయ్ పూనూరి దర్సకత్వంలో ఎ. పద్మనాభిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం కార్పొరేటర్. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చెసుకొని సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్న సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు కార్పోరేటర్ ట్రైలర్ ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా హీరో షకలక శంకర్ మాట్లాడుతూ.. మేము విడుదల చేసిన ట్రైలర్ కు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ట్రైలర్ లో నా యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయని చాలా మంది ఫోన్స్ చేసి ప్రశంశిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మా ట్రైలర్ ను ఇంతపెద్ద సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు.

చిత్ర దర్శక,నిర్మాతలు మాట్లాడుతూ.. కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రంలో షకలక శంకర్ మరియు హీరోయిన్లు చాలా బాగా నటించారు. వినోదానికి పెద్ద పీట వేస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అంతర్లీనంగా ఒక మంచి సందేశం ఉంటుంది. ఇందులోని పాటలు, ఫైట్స్ సందర్భానుసారంగా వస్తాయి. ఈ సినిమాలో 5 పాటలు, 4 ఫైట్స్ ఉంటాయి. మా యూనిట్ సభ్యుల సమక్షంలో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసినందుకు చాలా ఆనందంగా ఉందని  అన్నారు.

నటీనటులు: షకలక శంకర్, సునీత పాండే, లావణ్య శర్మ, కస్తూరి తదితరులు

సాంకేతిక నిపుణులు: బ్యానర్:- సమీప మూవీస్, యు అండ్ ఐ స్టూడియోస్, నిర్మాత:- ఎ. పద్మనాభిరెడ్డి, దర్శకుడు:- సంజయ్ పూనూరి, సహ నిర్మాత:- డాక్టర్ యస్.వి. మాధురి, కెమెరా:- జగదీష్ కొమరి, సంగీతం:- ఎం.ఎల్.పి.రాజా, ఎడిటర్:- శివ శర్వాణి, ఫైట్ మాస్టర్:- విన్చున్ అంజి, పి.ఆర్.ఓ:- మధు వి.ఆర్.

Shakalaka Shankar Corporator Trailer

Shakalaka Shankar Corporator Trailer
corporator
corporator movie
corporator movie trailer
shakalaka shankar corporator trailer
shakalaka shankar