Advertisement

అమరన్‌ ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1 షూటింగ్ స్టార్ట్

Fri 16th Jul 2021 05:39 PM
amaran in the city-chapter 1,amaran in the city-chapter 1 movie,aadi saikumar,avika gor,saikumar,aditya om,krishnudu,manoj nandan,svr productions pvt ltd,music krishna chaitanya kolli,pro sai satish,pro parvataneni rambabu,  అమరన్‌ ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1 షూటింగ్ స్టార్ట్
Amaran In The City-Chapter 1 Shooting Begins అమరన్‌ ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1 షూటింగ్ స్టార్ట్
Advertisement
ఆది సాయికుమార్ ప్రెస్టీజియస్ మూవీ అమరన్‌ ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1 షూటింగ్ ప్రారంభం
లవ్ లీ స్టార్ ఆది సాయికుమార్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా అమరన్‌ ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1. ఈ ప్రెస్టీజియస్ మూవీని నిర్మాత ఎస్ వీ ఆర్ నిర్మిస్తున్నారు. ఆది పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అవికా గోర్ నాయికగా నటిస్తోంది. సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటి వరకు రాని కొత్త కథా నేపథ్యంతో అమరన్‌ ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1 సినిమాను రూపొందిస్తున్నారు డెబ్యూ డైరెక్టర్ ఎస్ బాలవీర్. రెండేళ్లపాటు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి పక్కా ప్లానింగ్ తో షూటింగ్ కు రెడీ అయ్యింది అమరన్‌ ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1 సినిమా.
అమరన్‌ ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1 సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవల హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ ఫస్ట్ షెడ్యూల్ లో భారీ ఖర్చుతో నిర్మించిన పోలీస్ సెట్ లో షూటింగ్ చేస్తున్నారు. దీంతో పాటు నగర పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారు. ఆది సాయి కుమార్ సరికొత్త లుక్ లో కనిపించనున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కు ప్రాధాన్యత ఉండబోతోంది. 
సాయి కుమార్, ఆదిత్య ఓం, కృష్ణుడు, మనోజ్‌ నందన్‌, వీర శంకర్, అయన్, శృతి, రోషన్, మధు మణి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: ఎస్‌.బాల‌వీర్‌, నిర్మాత: ఎస్‌వీఆర్‌, సమర్పణ: జెమిని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: లక్ష్మణ్ స్వామి, నాగ మధు, సంగీతం: కృష్ణ చైతన్య, సినిమాటోగ్రఫీ: ఆర్.ఆర్ విష్ణు, లైన్‌ ప్రొడ్యూసర్‌: శ్వేతా కటకం, పబ్లిసిటీ డిజైనర్‌: కడియం వెంకట్‌, పి.ఆర్‌.ఓ: సాయి సతీశ్‌, పర్వతనేని రాంబాబు.

Amaran In The City-Chapter 1 Shooting Begins:

Adi Saikumar’s Prestigious Movie Amaran In The City-Chapter 1 Shooting Begins

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement