ఫైనల్ షెడ్యూల్ షూటింగ్‌లో వరుణ్‌తేజ్ గని
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మిస్తోన్న చిత్రం గని. వరుణ్‌తేజ్ ఇప్పటి వరకు చేయనటువంటి డిఫరెంట్ లుక్‌తో బాక్సర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం వరుణ్‌తేజ్ బాక్సింగ్‌లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుని నటిస్తుండటం విశేషం. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్ రీసెంట్‌గా హైదరాబాద్‌లో పునః ప్రారంభమైంది.
ఈ సందర్భంగా.. నిర్మాత సిద్ధు ముద్ద మాట్లాడుతూ కొవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితుల వల్ల ఆగిన మా గని సినిమా షూటింగ్‌ను ఇటీవలే మళ్లీ రీస్టార్ట్ చేశాం. ఇప్పుడు ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ అంతా పూర్తవుతుంది. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్ మూవీ ఇది. అందులో భాగంగా ఈ షెడ్యూల్‌లో క్లైమాక్స్ సహా భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. హాలీవుడ్ చిత్రం టైటాన్స్, బాలీవుడ్‌లో సుల్తాన్ వంటి చిత్రాలకు యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేసిన హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ లార్నెల్ స్టోవల్, వ్లాడ్ రింబర్గ్ ఆధ్వర్యంలో భారీ సెట్స్‌లో ఈ యాక్షన్ పార్ట్ చిత్రీకరణ జరుగుతుంది. ఈ షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేసిన తర్వాత రిలీజ్ డేట్‌కు సంబంధించిన ప్రకటన చేస్తాం అన్నారు.
బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషనల్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి జార్జ్ సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
నటీనటులు: వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర తదితరులు.
సాంకేతిక వర్గం: సినిమాటోగ్రఫీ: జార్జ్ సి.విలియమ్స్, మ్యూజిక్: తమన్.ఎస్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేశ్, నిర్మాతలు: సిద్ధు ముద్ద, అల్లు బాబీ, దర్శకత్వం: కిరణ్ కొర్రపాటి.