Advertisement

600 మంది సినీ వర్కర్స్ కు చేయూత

Wed 09th Jun 2021 07:40 PM
dil raju,chadavalawada srinivas rao,yalamanchili ravichand,film workers,  600 మంది సినీ వర్కర్స్ కు చేయూత
Dil Raju, Yalamanchili Ravichand donation to 600 film workers 600 మంది సినీ వర్కర్స్ కు చేయూత
Advertisement

కళామతల్లి చేదోడు కార్యక్రమం ద్వారా 600 మంది సినీ వర్కర్స్ కు చేయూత నందించిన ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, చదవాలవాడ శ్రీనివాస్ రావు, యలమంచిలి రవిచంద్.

ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు గారు, చదవాలవాడ శ్రీనివాస్ గారు,యలమంచిలి రవి చంద్ గార్లు ఆధ్వర్యంలో కళామతల్లి చేదోడు కార్యక్రమం ఈ రోజు ఉదయం 9 గంటలకు ఫిల్మ్ ఛాంబర్ లో  జరిగింది.ఈ కార్యక్రమంలో  మహిళా వర్కర్స్ కి, డ్రైవర్స్ కి, జూనియర్ ఆర్టిస్టులు కి, ప్రొడక్షన్ వర్కర్స్ కి సుమారు ఆరువందల మందికి  ఫుడ్ గ్రోసెరిస్ ఇవ్వటం జరిగింది. దాదాపు నెలకు సరిపడా నిత్య అవసరమ సామాగ్రి అయిన రైస్ బ్యాగ్, కంది పప్పు, రెండు ఆయిల్ పాకెట్స్, కంది పప్పు, గోధుమ పిండి, మినప గుండ్లు, పంచదార, ఎండుమిర్చి, గోధుమ రవ్వ, టీ పౌడర్, పసుపు, పెసర పప్పు, ఇడ్లీ రవ్వ, బొంబాయి రవ్వ, చింత పండు, రిన్ సోప్ లు, విమ్ బార్ లు, కోల్గేట్ పేస్ట్, జిరా, ఆవాలు, అన్ని రెండు కిలో లు తదితర సామాగ్రిని  జి మార్ట్ సూపర్ మార్కెట్ ద్వారా ప్యాక్ చేసి ఇవ్వటం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో  బెక్కం వేణుగోపాల్ గారు,అజయ్ కుమార్, వల్లభనేని అనిల్ కుమార్ గారు తదితరులు పాల్గొన్నారు, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కళామతల్లి చేదోడు ప్రతి ఒక్కరూ ఇలాంటి కష్ట కాలంలో భాగస్వామ్యం కావాలి అనేది మా ఉద్దేశం, దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూట్ చేయటం జరిగింది.

యలమంచిలి రవి చంద్ గారు మాట్లాడుతూ.. ప్రస్తుత కష్ట కాలంలో  ప్రతి పేద సినిమా కార్మికుడు, కార్మికురాలు ఎన్నో  ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారందరినీ దృష్టిలో పెట్టుకొని  వారందరినీ ఆదుకోవాలని కళామతల్లి చేదోడు కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో నాలుగు వేల మంది సినీ వర్కర్స్ వున్నారు. ఇప్పుడు వారందరికీ  ఓకే సారి గ్రాసరీస్ పంపిణీ చేస్తే ఇబ్బందులు తలెత్తుతాయని గుర్తించి కోవిడ్ కారణాల దృష్టా ప్రస్తుతం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న 600 మందికి పేద కార్మికులకు మొదటి విడతగా ఫుడ్ గ్రాసరీస్ ఇవ్వడం జరిగింది. మిగిలిన వారందరికీ కూడా దశల వారిగా ఫుడ్ గ్రాసరీస్ అందజేయడం జరుగుతుంది. చాలా మంది పెద్దలు సినీ  పేద కార్మికులకు సర్వీస్ చేయాలని వారికి మీరు సహయం చెయ్యమని  మాకు డబ్బు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అయితే వారి నుండి మేము ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వారు చేసే సహాయాన్ని మేము సెలెక్ట్ చేసుకొన్న సూపర్ మార్కెట్ కు పే చెయ్యమని సూచించడం జరిగింది. అ సూపర్ మార్కెట్  ద్వారా 2500 రూపాయల విలువ కలిగిన నెలకు సరిపడా ఫుడ్ గ్రాసరీస్ ను అందజేశాము. అలాగే కరోనా ఉన్నంత వరకు ప్రతి పేద సినీ కార్మికుడికీ మేము సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటాం. సినీ వర్కర్స్ కు సహాయం చేసే విషయంలో నేను దిల్ రాజు గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే ఒక్క మాట కూడా అడగకుండా ఒకే చెయ్యి ఏమి కావాలి అన్న నా సపోర్ట్ ఉంటుంది అని ముందుకు వచ్చినందుకు నా ధన్యవాదములు, అలాగే చదల వాడ శ్రీనివాసరావు గారు నేను అడగగానే ముందుకు వచ్చారు వారికీ నా ధన్య వాదములు తెలియచేస్తున్నాను. 

అజయ్ కుమార్ గారు మాట్లాడుతూ.. కరోనా కష్ట కాలం లో యలమంచిలి రవిచంద్ పనులు లేక ఇబ్బంది పడుతున్న వల్ల అందరకి తనవంతు సాయం గా ఇలాంటి కార్యక్రమం చేపడుతు న్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.

బెక్కం వేణుగోపాల్ గారు మాట్లాడుతూ... యలమంచిలి రవి చంద్ గారు ఈ కష్ట కాలం లో పేదలకి ఇలాంటి సాయం చేస్తున్నందుకు నా అభినందనలు తెలుఫుతున్నాను.

వల్లభనేని అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ.. ఈ కరోనా కష్ట కాలం లో మొట్ట మొదటి గా ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమం చేసి పేదలకు సాయం చేసినందుకు యలమంచిలి రవి చంద్ గారికి దిల్ రాజు గారికి, చదల వాడ శ్రీని వసరావు రావు గారికి నా ధన్య వాదములు తెలుపుతున్నాను. 

Dil Raju, Yalamanchili Ravichand donation to 600 film workers:

Dil Raju, Chadavalawada Srinivas Rao and Yalamanchili Ravichand donation to 600 film workers

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement