Advertisementt

తేజ సజ్జా ఇష్క్ విడుద‌ల వాయిదా..

Tue 20th Apr 2021 07:16 PM
teja sajja,ishq movie,ishq release postponed  తేజ సజ్జా ఇష్క్ విడుద‌ల వాయిదా..
Ishq Movie release postponed తేజ సజ్జా ఇష్క్ విడుద‌ల వాయిదా..
Advertisement
Ads by CJ

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండ‌డం..రోజు రోజూకీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న క్ర‌మంలో ఏప్రిల్‌23న విడుద‌ల కావాల్సిన ఇష్క్ చిత్రాన్ని వాయిదా వేస్తున్న‌ట్లు  ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌. దక్షినాదిలోని సుప్ర‌సిద్ద నిర్మాణ ‌సంస్థ‌ల్లో ఒక‌టైన మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై తేజ స‌జ్జ‌, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ హీరోహీరోయిన్లుగా య‌స్‌.య‌స్‌. రాజుని ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం చేస్తూ  ఆర్‌.బి.చౌద‌రి స‌మ‌ర్పణ‌లో ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఇష్క్‌.   ఏప్రిల్‌23న విడుద‌ల కావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్న‌ట్లు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌లు మాట్లాడుతూ - దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న వేళ ప్ర‌జ‌లంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు త‌గిన మార్గ నిర్దేశకాలు విడుద‌ల‌చేశాయి. అందులో భాగంగా ఏపీలో 50శాతానికి  థియేట‌ర్ల ఆక్యుపెన్సి త‌గ్గించ‌డం, తెలంగాణ‌లో రాత్రి పూట క‌ర్ఫ్యూ విధించ‌డం జ‌రిగింది. ఇలాంటి టైమ్‌లో సినిమా రిలీజ్‌ చేయ‌డం కరెక్ట్ కాద‌ని భావించి ఈ నెల 23న విడుద‌ల‌కావాల్సిన `ఇష్క్` చిత్రాన్ని వాయిదా వేస్తున్నాం. ప‌రిస్థితుల‌న్నీ అనుకూలించిన తర్వాత క్రొత్త విడుద‌ల తేదిని ప్ర‌క‌టిస్తాం అన్నారు

Ishq Movie release postponed:

Teja Sajja Ishq Movie release postponed

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ