Advertisement

అఫీషియల్: విరాట‌ప‌ర్వం వాయిదా

Wed 14th Apr 2021 06:42 PM
rana,sai pallavi,venu udugula,virata parvam,virata parvam movie release,postponed  అఫీషియల్: విరాట‌ప‌ర్వం వాయిదా
Virata Parvam Release Gets Postponed అఫీషియల్: విరాట‌ప‌ర్వం వాయిదా
Advertisement

రానా, సాయిప‌ల్ల‌వి జంట‌గా వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న సినిమా విరాట‌ప‌ర్వం. ఈ సినిమాలో ఇంత‌వ‌ర‌కూ చూడ‌ని స‌రికొత్త పాత్ర‌ల‌లో రానా, సాయి ప‌ల్ల‌వి కనిపించ‌నున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్‌తో పాటు ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్ ట్రెమండ‌స్ రెస్పాన్స్ సాధించింది.

90వ ద‌శ‌కంలో జ‌రిగిన య‌ధార్ధ సంఘటనల నుండి ప్రేరణ పొందిన ఈ చిత్రంలో రానా కామ్రేడ్ రవ‌న్న పాత్ర పోషిస్తున్నారు. అతను తన కలంపేరు `అరణ్య`గా ప్ర‌సిద్ది.  సాయి పల్లవి వెన్నెల అనే పాత్ర‌లో  అతని ఆరాధకురాలిగా కనిపించ‌నుంది. ఒక అద్భుతమైన ప్రేమకథగా విరాట పర్వం  తెర‌కెక్కుతోంది.

దేశ వ్యాప్తంగా పెరుగుతున్న క‌రోనా వ్యాప్తి (Spike in Covid-19) కార‌ణంగా ఏప్రిల్ 30న విడుద‌ల కావాల్సిన విరాట‌ప‌ర్వం సినిమాను వాయిదా వేస్తున్న‌ట్లు  ప్ర‌క‌టించారు మేకర్స్‌. కొత్త విడుద‌ల తేదిని త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్నారు.

Virata Parvam Release Gets Postponed:

Rana, Sai Pallavi, Venu Udugula Virata Parvam Release Gets Postponed

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement