నారప్ప చేతుల మీదుగా నరసింహపురం ట్రైలర్

గీత్ గౌరవ్ సినిమాస్ పతాకంపై.. పి.ఆర్.క్రియేషన్స్ సమర్పణలో టి.ఫణిరాజ్ గౌడ్- నందకిశోర్ ధూళిపాలతో కలిసి శ్రీరాజ్ బళ్లా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఫ్యామిలీ ఓరియంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ నరసింహపురం. పలు సీరియల్స్, సినిమాల ద్వారా సుపరిచితుడైన నందకిశోర్ ఈ చిత్రం ద్వారా హీరోగా మారుతున్నారు. సిరి హనుమంతు హీరోయిన్ గా నటిస్తుండగా.. వర్ధమాన నటి ఉష హీరో చెల్లెలు పాత్రలో నటించారు.
ఈ చిత్రం టీజర్ ను అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్ విడుదల చేసి... చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ చిత్రంతో హీరోగా మారుతున్న నంద కిషోర్ హీరోగానూ మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన అభిలషించారు.
ఈ కార్యక్రమంలో హీరో నందకిషోర్, దర్శకులు శ్రీరాజ్ బళ్ళా, నిర్మాతల్లో ఒకరైన ఫణిరాజ్ గౌడ్, కెమెరామెన్ కర్ణ ప్యారసాని పాల్గొన్నారు. తమ చిత్రం ట్రైలర్ ను విక్టరీ వెంకటేష్ విడుదల చేయడం పట్ల దర్శకనిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు. వెంకటేష్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని అన్నారు.
Narasimhapuram Trailer Launch
Narasimhapuram Trailer Launch By Venkatesh







































