Advertisementt

ఊరికే చ‌రిత్ర‌ను సృష్టించ‌లేం..

Fri 29th Jan 2021 07:30 PM
kgf chapter 2,yash,prashanth neel,kgf 2 release date,july 16th  ఊరికే చ‌రిత్ర‌ను సృష్టించ‌లేం..
KGF Chapter 2 release date locked ఊరికే చ‌రిత్ర‌ను సృష్టించ‌లేం..
Advertisement
Ads by CJ

రాకింగ్ స్టార్ యష్, ప్రశాంత్ నీల్, హోంబలే ఫిలింస్ కాంబినేష‌న్‌లో హై ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో రూపొందుతోన్న భారీ‌ ప్యాన్ ఇండియా మూవీ కేజీయఫ్ ఛాప్టర్ 2...జూలై 16న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ విడుద‌ల‌

తొంద‌ర‌ప‌డితే చ‌రిత్ర‌ను తిర‌గ రాయ‌లేం..ఊరికే చ‌రిత్ర‌ను సృష్టించ‌లేం.. 

ఇది నిజ‌మ‌ని న‌మ్మించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు రాకీభాయ్‌.. 

కేజీయ‌ఫ్ ఛాప్ట‌ర్ 1 తో న‌‌రాచిలో మొద‌లైన రాకీభాయ్ దండ‌యాత్రం ప్యాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. ఇప్పుడు బాక్సాఫీస్ వ‌ద్ద ఈ దండ‌యాత్ర‌ను కంటిన్యూ చేయ‌డానికి రాకీభాయ్ మ‌రోసారి సిద్ధ‌మ‌వుతున్నాడు.. ఇంత‌కీ ఈ రాకీభాయ్ ఎవ‌రో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.. రాకింగ్ స్టార్ య‌ష్‌....

రాకింగ్ స్టార్ య‌ష్ క‌థానాయ‌కుడిగా క్రేజీ డైరెక్ట‌ర్‌గా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న హై ఎక్స్‌పెక్టేష‌న్ మూవీ కేజీయ‌ఫ్ ఛాప్ట‌ర్ ‌2. యష్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనాటాండన్, ప్రకాశ్‌రాజ్ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్ 150 మిలియన్ వ్యూస్‌తో 7.5 మిలియన్ లైక్స్‌తో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ రికార్డే చెబుతోంది సినిమా కోసం ప్రేక్షకులు ఎంత క్రేజీగా ఎదురుచూస్తున్నారో. ఆ అంచనాలకు ధీటుగా  కేజీయ‌ఫ్ ఛాప్ట‌ర్ ‌2 ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 

కేజీయఫ్ ఛాప్టర్ 1కు కొనసాగింపుగా రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం కేజీయఫ్ ఛాప్టర్ 2. వరుస ప్యాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తూ దక్షిణాది సినిమాల రేంజ్‌ను ప్యాన్ ఇండియా రేంజ్‌కు పెంచుతున్న అగ్ర నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిర‌గందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు శ‌ర‌వేగంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. ఈ ప్యాన్ ఇండియా మూవీని జూలై 16న విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ చిత్రాన్ని తెలుగులో వారాహి చ‌ల‌న చిత్రం విడుద‌ల చేస్తుంది. ఈ చిత్రానికి ర‌వి బ‌స్రూర్ సంగీతం .. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

KGF Chapter 2 release date locked:

KGF Chapter 2 release on July 16th

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ