Advertisement

గోపీచంద్- మారుతి మూవీ కన్ఫర్మ్

Thu 07th Jan 2021 10:17 AM
macho hero,gopichand,maruthi,ga 2 pictures,uv creations,maruthi - gopichand movie conform  గోపీచంద్- మారుతి మూవీ కన్ఫర్మ్
Gopichand - Maruthi Movie Confirm గోపీచంద్- మారుతి మూవీ కన్ఫర్మ్
Advertisement

ప్ర‌తిరోజు పండ‌గే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ త‌రువాత విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు మారుతి చేయ‌బోయే సినిమా పై అంతటా ఆస‌క్తి, ఉత్కంఠ నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే, ఈ నేప‌థ్యంలో మ్యాచో హీరో గోపీచంద్ తో ఓ సూప‌ర్ డూప‌ర్ క‌మ‌ర్షీయ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ ని తెర‌కెక్కించ‌డానికి రంగం సిద్ధం చేశారు ద‌ర్శ‌కుడు మారుతి. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ‌లు జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దీంతో ముచ్చ‌ట‌గా మూడోసారి జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ - బ‌న్నీవాసు - మారుతి కాంబినేష‌న్ సెట్ అయింది. గ‌తంలో ఈ బ్యాన‌ర్స్ ద్వారానే మారుతి భ‌లేభ‌లే మ‌గాడివోయ్, ప్ర‌తిరోజు పండ‌గే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందించారు.

స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్స్ బ‌న్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీ చంద్ - మారుతి కాంబినేష‌న్ లో సినిమా రాబోతుంద‌నే ప్ర‌క‌ట‌న‌ కూడా వైవిధ్యంగా ఉండేలా ప్లాన్ చేయ‌డం జ‌రిగింది. ప్ర‌తిరోజు పండ‌గే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌రువాత మారు‌తి చేయ‌బోయే సినిమా పై వ‌చ్చిన పుకార్ల‌కు సెటైర్లు వేస్తూ, మారుతి మార్క్ స్టైల్ లో ఓ హ్యూమ‌ర‌స్ వీడియోని సిద్ధం చేసి విడుద‌ల చేశారు, ప్ర‌స్తుతం ఈ ఎనౌన్స్ మెంట్ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఈ వీడియోకి ప్ర‌ముఖ న‌టుడు రావుర‌మేశ్ గారి వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌డం కొసమెరుపు. గోపిచంద్ 29వ సినిమాగా, మారుతి 10వ సినిమాగా ఈ ప్రాజెక్ట్ రాబోతుంది, దీనికి సంబంధించిన టైటిల్ లుక్, ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ త్వ‌ర‌లో అధికారికంగా విడుద‌ల అవ్వ‌బోతున్నాయి.

Gopichand - Maruthi Movie Confirm :

Macho hero Gopichand, Maruthi, GA 2 Pictures - UV Creations join hands for a new project

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement