Advertisementt

యూట్యూబ్‌లో ‘వీకెండ్ ల‌వ్’ రికార్డు

Tue 29th Dec 2020 08:00 PM
gavara nagu,weekend love movie  యూట్యూబ్‌లో ‘వీకెండ్ ల‌వ్’ రికార్డు
Congratulations to Director Nagu Gavar యూట్యూబ్‌లో ‘వీకెండ్ ల‌వ్’ రికార్డు
Advertisement
Ads by CJ

యూట్యూబ్‌లో ‘వీకెండ్ ల‌వ్’ రికార్డు.

తెలుగు సినిమాల స‌త్తా ఏంటో మరోసారి రుజువైంది. వీకెండ్ ల‌వ్ మూవీ హిందీలో విడుద‌లై అక్క‌డి మూవీ ల‌వ‌ర్స్ ను విప‌రీతంగా అల‌రిస్తోంది. రికార్డుస్థాయిలో వ్యూస్ వ‌స్తున్నాయి. యంగ్ డైరెక్ట‌ర్ నాగు గ‌వ‌ర ద‌ర్శ‌కత్వంలో శ్రీ‌హ‌రి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన వీకెండ్ ల‌వ్ మూవీ ఐదేళ్ల క్రితం విడుద‌లై ఇక్క‌డ‌ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ హిందీలో కూడా డ‌బ్ అయి అక్క‌డ మొత్తం 28 కోట్ల వ్యూస్‌ను అందుకుని అరుదైన రికార్డును సాధించింది. భారీ బడ్జెట్ సినిమాల‌కే హిందీలో అద‌ర‌ణ ఉంటుంది అనే టాక్ నిజం కాద‌ని వీకెండ్ ల‌వ్ ‌మూవీ నిరూపించింది. హిందీ రైట్స్ తీసుకున్న‌వారు యూట్యూబ్‌లో మూడేళ్ల నుంచి ప‌లుమార్లు ప‌బ్లిష్ చేయ‌గా ప్ర‌తిసారి కోట్ల‌ల్లో వ్యూస్ రావ‌డం అరుదైన రికార్డుగా చెప్పుకోవచ్చు. హిందీలో ఫ‌స్ట్ ల‌వ్, ల‌వ్‌స్టోరీ, ఐ హేట్ ల‌వ్‌స్టోరీ.. టైటిళ్ల‌తో ప‌లుమార్లు యూట్యూబ్‌లో ప‌బ్లిష్ అయింది ఈ మూవీ. ఈ సినిమా హిందీ జ‌నాల‌కు ఎంత‌గా న‌చ్చిందో పాజిటివ్ కామెంట్స్ చూస్తే తెలుస్తుంది. హిందీలో ఈ సినిమా సృష్టిస్తోన్న రికార్డుల‌తో నాగు గ‌వ‌ర‌కు బాలీవుడ్ నుంచి ఆఫ‌ర్‌లు కూడా వ‌స్తున్నాయని చెబుతున్నారు.

వీకెండ్ ల‌వ్ ‌మూవీ ‌హిందీ వెర్ష‌న్ వ్యూస్ ప‌రంగా రికార్డుసృష్టిస్తుండ‌టంతో డైరెక్ట‌ర్ నాగు గ‌వ‌ర‌కు అభినంద‌న‌ల వెల్లువ మొద‌లైంది. నాగు గ‌వ‌ర ఫ‌స్ట్ మూవీ వీకెండ్ ల‌వ్, ఆ త‌ర్వాత క‌ర్త‌-క‌ర్మ‌-క్రియ మూవీ చేశాడు. ఏదీఏమైనా తెలుగు సినిమా స‌త్తా ఏంటో మ‌రోసారి నిరూపిత‌మైంద‌ని సినీ జ‌నాలు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

Congratulations to Director Nagu Gavar:

Record Weekend Love movie on YouTube

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ