Advertisementt

జీఎఫ్ మూవీ టీజర్ విడుదల

Sat 26th Dec 2020 07:31 PM
gf movie,gf teaser launch  జీఎఫ్ మూవీ టీజర్ విడుదల
GF movie teaser launch జీఎఫ్ మూవీ టీజర్ విడుదల
Advertisement
Ads by CJ

యువ హీరో చిరంజీవి కుంచాల నటిస్తున్న కొత్త సినిమా జీఎఫ్. వైదేహి శర్మ, అస్మా మిర్జా నాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాను భారతి క్రియేషన్స్, కేథరీన్ ఫిల్మ్ మేకర్స్, మౌనిక ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారతి కుంచాల, వెంకట్ కృష్ణ కుంచాల నిర్మాతలు.  హీరోగా నటిస్తూ జీఎఫ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు చిరంజీవి కుంచాల. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతో పాటు వైఎస్ఆర్ సీపీ నాయకులు వెంకట్ రెడ్డి, టీఎమ్మార్పీఎస్ నేత ఇటుక రాజు మాదిగ, మాల మహానాడు నాయకులు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా

దర్శకుడు, హీరో చిరంజీవి కుంచాల మాట్లాడుతూ..చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన స్ఫూర్తితోనే హీరోగా మారాను. జీఎఫ్ మూవీలో యాక్షన్, రొమాన్స్, ఎంటర్ టైన్ మెంట్ లాంటి ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉంటాయి. తండ్రి కూతురు మధ్య ఉండే చెప్పలేనంత ప్రేమ మా సినిమాలో చూస్తారు. ఫాదర్ సెంటిమెంట్, ఎమోషన్ తో ప్రధానంగా సినిమా సాగుతుంది. ప్రస్తుతం మా సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలో ప్రేక్షకుల ముందుకు జీఎఫ్ సినిమాను తీసుకొస్తాం. చిన్న చిత్రాలకు ఇండస్ట్రీ పెద్దలు సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నా. అన్నారు.

మాల మహానాడు నాయకులు చెన్నయ్య మాట్లాడుతూ..చిరంజీవి కుంచాల హీరోగా పేరు తెచ్చుకోవాలి. ఈ సినిమాను రెండు రాష్ట్రాల ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లేందుకు మా వంతు సహకారం అందిస్తాం. అన్నారు. 

జీఎఫ్ మూవీ టీజర్ ఆసక్తికరంగా ఉంది. పాటలు వినాలనిపించేలా ఉన్నాయి. ఈ సినిమా గుడ్ ఫిల్మ్ గా, గ్రేట్ ఫిల్మ్ గా పేరు తెచ్చుకోవాలని ఇతర అతిథులు ఆకాంక్షించారు.

ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్ - కళ్యాణ్, కొరియోగ్రఫీ - వెంకట్ దీప్, సినిమాటోగ్రఫీ - వల్లి, ఎడిటర్ - ఎంఎన్ఆర్, సంగీతం - యూవీ నిరంజన్, స్టంట్స్ - షావోలిన్ మల్లేష్, నిర్మాతలు - భారతి కుంచాల, వెంకట్ కుంచాల, కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం - చిరంజీవి కుంచాల.

GF movie teaser launch:

GF movie teaser launch

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ