Advertisementt

లావణ్య కు లవ్లీ గిప్ట్

Tue 15th Dec 2020 01:06 PM
chaavu kaburu challaga,lavanya tripathi,birthday special  లావణ్య కు లవ్లీ గిప్ట్
Chaavu Kaburu Challaga Lavanya Tripathi Birthday Special Poster లావణ్య కు లవ్లీ గిప్ట్
Advertisement
Ads by CJ

లావ‌ణ్య త్రిపాఠి బ‌ర్త్ డే పోస్ట‌ర్ విడుద‌ల చేసిన చావు క‌బురు చ‌ల్లగా చిత్ర బృందం

మెగా ప్రొడ్యూస‌ర్  అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో వ‌రస విజయాలు అందుకుంటూ సక్సెస్ కు మారుపేరుగా నిలిచిన ‌బన్నీ వాసు నిర్మాత‌గా ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో కార్తీకేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నూత‌న ద‌ర్శకుడు కౌశిక్ పెగ‌ళ్లపాటి తెర‌కెక్కిస్తున్న చిత్రం చావు క‌బురు చ‌ల్లగా. 

ఈ సినిమాలో డింపుల్‌ బ్యూటి లావ‌ణ్య త్రిపాఠి మ‌ల్లిక అనే హైద‌రాబాదీ బ‌స్తీ అమ్మాయిగా క‌నిపించ‌నుంది. మ‌ల్లిక‌గా లావ‌ణ్య త్రిపాఠి లుక్ ఇప్ప‌టికే విడుద‌లై అనూహ్య స్పంద‌న అందుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో లావ‌ణ్య త్రిపాఠి పుట్టిన రోజు సంద‌ర్భంగా కొత్త లుక్ ని విడుద‌ల చేశారు. శొట్ట బుగ్గ‌ల‌తో న‌వ్వూతూ క‌నిపిస్తున్న లావ‌ణ్య త్రిపాఠి స్టిల్ తో చూసిన వెంట‌నే ఆక‌ట్టుకునే రీతిన చావుక‌బ‌రుచ‌ల్ల‌గా టీమ్ ఈ కొత్త లుక్ ని సిద్ధం చేశారు. ఇక ఈ చిత్రంలో హీరోగా న‌టిస్తున్న యంగ్ హీరో కార్తికేయ బ‌స్తి బాలారాజు గెటెప్, క్యారెక్ట‌రైజేష‌న్ చాలా కొత్త‌గా ఆకట్టుకునే విధంగా ఉంటాయ‌ని, అలానే లావ‌ణ్య పాత్ర కూడా న్యాచురల్ గా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాకు జకీస్ బీజాయ్ సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రం గురించి నిర్మాత బ‌న్నీ వాసు గారు మాట్లాడుతూ జిఏ2 పిక్చర్స్ బ్యాన‌ర్ లో భ‌లేభ‌లే మ‌గాడివోయ్‌, గీతాగోవిందం, ప్రతిరోజు పండ‌గే చిత్రాలు ఘ‌న‌ విజాయాలు సాధించాయి. అలాంటి బ్యాన‌ర్ లో వ‌చ్చే ప్రతీ చిత్రంపై ప్రేక్షకుల‌కి అంచ‌నాలు వుంటాయి. వారిని దృష్థిలో పెట్టుకుని చిత్రాలు నిర్మిస్తున్నాం. కార్తికేయ గ‌త చిత్రాలకి ఈ చిత్రం పూర్తి భిన్నంగా వుండాలి అనుకున్నాం. అందుకే బస్తీబాల‌రాజు గా టీజ‌ర్ లో చూపించాం. లావ‌ణ్య త్రిపాఠి ని మ‌ల్లిక గా ప‌రిచ‌యం చేసాం. త‌న పాత్ర ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోతుంది. అన్ని వార్గాల్ని ఆక‌ట్టుకునే రీతిన ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు కౌశిక్ తెర‌కెక్కిస్తున్నాడు అని అన్నారు

తారాగ‌ణం..

కార్తీకేయ‌, లావ‌ణ్య త్రిపాఠి, ఆమ‌ని,ముర‌ళి శ‌ర్మ‌, ర‌జిత‌, భ‌ద్రం, మ‌హేష్‌, ప్ర‌భు త‌దితరులు

Chaavu Kaburu Challaga Lavanya Tripathi Birthday Special Poster:

Chaavu Kaburu Challaga team releases Lavanya Tripathi birthday poster

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ