నేడే విడుదల సినిమా ప్రీ లుక్ విడుదల..!
ఐకా ఫిల్మ్ ఫాక్టరీ బ్యానర్ పై అసిఫ్ ఖాన్ మరియు మౌర్యాని హీరో హీరోయిన్స్ లుగా నటిస్తున్న సినిమా నేడే విడుదల. ఈ సినిమా ద్వారా రామ్ రెడ్డి పన్నాల డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి చిత్ర యూనిట్ ఫ్రీ లుక్ విడుదల చేశారు. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా యూనిట్ సభ్యులు ఒక వీడియో విడుదల చేసారు. ఆ వీడియో ఆ సినిమా తాలూకా కొత్త ప్రచారాలకు నాంది పలికింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శెరవేగంగా జరుగుతున్నాయని, అతి తొందర్లో సినిమా ఫస్ట్ లుక్, సాంగ్ ని విడుదల చేస్తాం అని చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు.
ఆసక్తికరమైన కథతో, ఆలోచింపచేసే కథనంతో, ఆహ్లదపరిచే సంభాషణలతో, విన్నూతనమైన ప్రచారంతో మన ముందుకు రానున్న ఈ నేడే విడుదల సినిమాలో మిగిలిన తారాగణంగా కాశి విశ్వనాథ్, అప్పాజీ అంబరీషా, మాధవి, టి ఎన్ ఆర్, అదుర్స్ ఆనంద్, పీలా గంగాధర్, జబర్దస్ నవీన్, అశోక వర్ధన్, రసజ్ఞ లు నటించిగా, ఈ సినిమాకు సంగీతం అజయ్ అరసాడ, లిరిక్స్ శ్రీమణి, కెమెరా సి హిచ్ మోహన్ చారి, ఎడిటింగ్ సాయి బాబు తలారి, ఫైట్స్ అంజి, ఆర్ట్ డైరెక్టర్ సి హెచ్ రవి కుమార్, వి ఎఫ్ ఎక్స్ : ఆర్ అంకోజీ రావు, నిర్మాతలు నజురుల్లా ఖాన్, మస్తాన్ ఖాన్, రచన దర్శకత్వం రామ్ రెడ్డి పన్నాల.
Click Here: Nede Vidudala Movie Stills
Click Here: Nede Vidudala Teaser