Advertisementt

ప్రభాస్ - ప్రశాంత్‌ నీల్ పాన్ ఇండియా మూవీ ‘సలార్’

Wed 02nd Dec 2020 03:48 PM
prabhas,prashanth neel,pan india film,salar movie,salar mvie poster  ప్రభాస్ - ప్రశాంత్‌ నీల్ పాన్ ఇండియా మూవీ ‘సలార్’
Prabhas - Prashanth Neel Combo 'Salar' Anouncement ప్రభాస్ - ప్రశాంత్‌ నీల్ పాన్ ఇండియా మూవీ ‘సలార్’
Advertisement
Ads by CJ

ప్యాన్ ఇండియా ‌స్టార్‌ ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్‌ నిర్మాణంలో రూపొందనున్న ప్యాన్‌ ఇండియా మూవీ ‘సలార్’

భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో క్వాలిటీ చిత్రాల‌ను నిర్మించి ద‌క్షిణాది సినీ పరిశ్ర‌మ‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లాల‌నే ఉన్న‌తాశ‌యంతో ప్రారంభమైన నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్‌ ఇప్పుడు ప్యాన్‌ ఇండియా నిర్మాణ సంస్థగా మారింది. ఈ బ్యానర్‌లో రాకింగ్‌స్టార్ య‌ష్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో చేసిన భారీ బడ్జెట్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్ ప్యాన్‌ ఇండియా మూవీ ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్‌1’ బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే మ‌రో ప్యాన్ ఇండియా భారీ బ‌డ్జెట్ మూవీ ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2’ చిత్రీకరణ దశలో ఉంది. ఈ  సినిమా విడుద‌ల గురించి ప్రేక్ష‌కాభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూశారు. ఇప్పుడు హోంబ‌లే ఫిలింస్ అధినేత విజయ్‌ కిరగందూర్...ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తన బ్యానర్‌లో మూడో ప్యాన్ ఇండియా మూవీగా .‘సలార్’ను రూపొందించనున్నట్లు ప్రకటించారు. సినిమా టైటిల్‌తో పాటు ప్రభాస్ లుక్‌ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సంద‌ర్భంగా...

విజయ్‌ కిరగందూర్‌ మాట్లాడుతూ మా బ్యానర్‌లో కె.జి.యఫ్‌ చాప్టర్‌ 1, కె.జి.యఫ్‌ చాప్టర్‌ 2 వంటి ప్యాన్‌ ఇండియా చిత్రాల తర్వాత మూడో ప్యాన్‌ ఇండియా చిత్రాన్ని రూపొందించబోతున్నాం. అటు ప్రేక్షకులు, ఇటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఈ సినిమాను రూపొందించనున్నారు. బాహుబలిగా ప్రపంచ సినీ ప్రేక్షకులను అలరించిన ప్యాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో సినిమా షూటింగ్‌ను స్టార్ట్‌ చేయబోతున్నాం. ఇప్పుడు ప్రభాస్‌ చేస్తున్న రాధేశ్యామ్‌ విడుదల తర్వాత సినిమాను విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నాం. ప్యాన్‌ ఇండియా మూవీగా రూపొందనున్న ‘సలార్’ చిత్రాన్ని భారతీయ భాషలన్నింటిలో రూపొందిస్తాం అన్నారు.

Prabhas - Prashanth Neel Combo 'Salar' Anouncement:

Prabhas - Prashanth Neel Pan India Film'Salar' Anouncement

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ