'కాదల్' మూవీ టీజర్ విడుదల

Sun 15th Nov 2020 11:32 AM
vishwanth,chitra shukla,kaadal  'కాదల్' మూవీ టీజర్ విడుదల
KaadalL teaser Launch 'కాదల్' మూవీ టీజర్ విడుదల
Advertisement
Ads by CJ

విశ్వంత్, చిత్ర శుక్ల జంటగా నటించిన సినిమా కాదల్. ఈ చిత్రంతో

కళ్యాణ్ జీ గొంగన దర్శకుడిగా పరిచయమవుతున్నారు. టఫ్ఎండ్ స్టూడియోస్

లిమిటెడ్ స్టూడియోస్ లిమిటెడ్ పతాకంపై కిరణ్ రెడ్డి మందాడి

నిర్మిస్తున్నారు. దీపావళి పండగ సందర్భంగా కాదల్ సినిమా టీజర్ ను విడుదల

చేశారు.

టీజర్ చూస్తే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా తెలుస్తోంది. 2004లో జరిగిన ప్రేమ

కథ అంటూ టీజర్ లో చూపించారు. అందమైన అమ్మాయిని చూడగానే ఆమెతో మాట్లాడాలని

ప్రయత్నించే రొమాంటిక్ కుర్రాడి పాత్రలో హీరో యశ్వంత్ కనిపించాడు. నా

వయసు నీకంటే ఎక్కువని బాధపడుతున్నావా అని హీరోయిన్ చిత్ర శుక్ల అడిగితే,

అబ్బే ఏజ్ గురించి ఏముంది ఊరికే మాట్లాడటానికి అంటూ మనసులోని ప్రేమను

దాచే ప్రయత్నం చేస్తున్నట్లు టీజర్ లో ఉంది. ఆ అమ్మాయి నీకు కూడా అక్కేరా

అంటూ తండ్రి కొడుకును కంట్రోల్ లో పెట్టేందుకు చెప్పే డైలాగ్ లు సరదాగా

ఉన్నాయి. టీజర్ లో వచ్చిన థీమ్ మ్యూజిక్ ఎంతో ప్లెజంట్ గా ఉండి

ఆకట్టుకుంటోంది.

KaadalL teaser Launch:

Vishwanth - Chitra shukla Kaadal Teaser Release

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ