Advertisementt

రానా విడుదల చేసిన వ‌సంత కోకిల‌ ఫస్ట్ లుక్!!

Thu 05th Nov 2020 09:06 PM
simha,vasantha kokila,rana,first look  రానా విడుదల చేసిన వ‌సంత కోకిల‌ ఫస్ట్ లుక్!!
Rana Launches VASANTHA KOKILA First Look రానా విడుదల చేసిన వ‌సంత కోకిల‌ ఫస్ట్ లుక్!!
Advertisement
Ads by CJ

నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ బాబీ సింహా హీరోగా రాబోతున్న ట్రైలింగ్వ‌ల్ మూవీ వ‌సంత కోకిల‌

బాబీ సింహా పుట్టిన‌రోజు(Nov6) సంద‌ర్భంగా వ‌సంత కోకిల ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన స్టార్ హీరో రానా

ఎస్ ఆర్ టి ఎంట‌ర్ టైన్మెంట్స్, ముద్ర ఫిల్మ్ ఫ్యాక్ట‌రీ బ్యానర్లు సంయుక్తంగా తెలుగు, త‌మిళ, క‌న్న‌డ భాష‌ల్లో జాతీయ అవార్డు గ్ర‌హీత బాబీ సింహా హీరోగా రూపొందిస్తోన్న‌ ట్రైలింగ్వ‌ల్ మూవీ వ‌సంత కోకిల‌. ప్ర‌ముఖ నిర్మాత రామ్ త‌ళ్లూరి నిర్మాణ సార‌ధ్యంలో నూత‌న ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ‌న్ పురుషోత్త‌మ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ సింహాకి జోడిగా @న‌ర్త‌న‌శాల ఫేమ్ కాశ్మీర ప‌ర్ధేశీ హీరోయిన్ గా న‌టిస్తోంది. నవంబ‌న్ 6న బాబీ సింహా పుట్టిన రోజు సంద‌ర్భంగా ప్ర‌ముఖ తెలుగు స్టార్ హీరో ఈ సినిమా టైటిల్ వ‌సంత కోకిల ని ఎనౌన్స్ చేయ‌డంతో పాటు త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా ఫ‌స్ట లుక్ ని కూడా విడుద‌ల చేశారు. అలానే త‌మిళ నుంచి స్టార్ హీరో ధ‌నుష్, క‌న్న‌డ స్టార్ హీరో ర‌క్షిత్ శెట్టి కూడా ఈ సినిమాకి సంబంధించిన త‌మిళ‌, క‌న్న‌డ టైటిల్స్ తో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ల‌ని ఆన్ లైన్ లో రిలీజ్ చేశారు. రొమాంటిక్ థ్రిల్ల‌ర్ జాన‌ర్ గా ఈ సినిమా రెడీ అవుతుంది. తాజాగా విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ లో బాబీ సింహా విల‌క్ష‌ణ‌త ప్ర‌తిభింబిచేలా చేతిలో బౌ అండ్ యారో, ఫారేస్ట్ బ్యాక్ డ్రాప్, డార్క్ గ్రిన్ క‌ల‌ర్ టింట్ ఇలా ఎన్నో ఉత్కంఠ రేపే ఎలిమెంట్స్ ఉన్నాయి. సినిమా జాన‌ర్ కి, బాబీ సింహా అత్యుత్త‌మ ప‌ర్ఫార్మెన్స్ కి త‌గిన విధంగానే ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ‌న్ వ‌సంత కోకిలను తెర‌కెక్కించార‌ని చిత్ర బృందం కాన్ఫిడెంట్ గా చెబుతోంది. జాతియ అవార్డు గ్ర‌హిత‌, విల‌క్ష‌ణ హీరో క‌మ‌లహాస‌న్, శ్రీదేవి కాంబినేష‌న్ లో వ‌చ్చిన వ‌సంత కోకిల ఏ రేంజ్ స‌క్సెస్ అందుకుందో అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్ తో తెర‌కెక్కుతున్న సినిమాలో మ‌రో జాతీయ అవార్డు గ్ర‌హీత బాబీ సింహా న‌టించ‌డం విశేషం. థింక్ మ్యూజిక్ వారు ఈ సినిమా ఆడియో రైట్స్ ద‌క్కించుకున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత రామ్ త‌ళ్లూరి తెలిపారు.

Rana Launches VASANTHA KOKILA First Look:

Simha’s upcoming Movie titled as VASANTHA KOKILA  

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ