Advertisementt

సునీల్ కుమార్ రెడ్డి హ‌నీట్రాప్‌!

Tue 27th Oct 2020 09:07 PM
honeytrap movie,sunil kumar reddy honeytrap movie launch,honeytrap movie stills  సునీల్ కుమార్ రెడ్డి హ‌నీట్రాప్‌!
Sunil Kumar Reddy Honeytrap Movie Launch సునీల్ కుమార్ రెడ్డి హ‌నీట్రాప్‌!
Advertisement
Ads by CJ

భ‌ర‌ద్వాజ్ సినీ క్రియేష‌న్స్  హ‌నీట్రాప్‌ మూవీ ప్రారంభం.

సొంత ఊరు, గంగపుత్రులు, గల్ఫ్ వంటి సామాజిక చిత్రాలను,  రొమాంటిక్ క్రైమ్ కథ, క్రిమినల్ ప్రేమ కథ వంటి యూత్ ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న రొమాంటిక్ సోష‌ల్ థ్రిల్ల‌ర్ హ‌నీట్రాప్‌. భ‌ర‌ద్వాజ్ సినీ క్రియేష‌న్స్ ప‌తాకంపై వి.వి వామ‌న రావు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌డంతో పాటు ఈ చిత్రానికి క‌థా, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సాయి ఋషి, తేజు అనుపోజు హీరో హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా న‌టుడు శివ కార్తిక్ కీల‌క‌ పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ  రెగ్యుల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభంకానున్న సంద‌ర్భంగా  విలేఖ‌రుల స‌మావేశం ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్‌. ఈ కార్య‌క్ర‌మంలో..

ద‌ర్శ‌కుడు పి.సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ -  ప్ర‌ముఖ రంగస్థ‌ల నాట‌క ర‌చ‌యిత, మిత్రుడు వామ‌న రావు మంచి క‌థ‌ వినిపించారు. నేను చేసిన జోనర్స్‌కి ద‌గ్గ‌ర‌గా ఉంటూ క‌మర్షియ‌ల్ అంశాల‌తో ఆడియ‌న్స్ అల‌రించే స‌బ్జెక్ట్ కావ‌డంతో ద‌ర్శ‌క‌త్వ‌ భాద్య‌త‌లు స్వీక‌రించ‌డం జ‌రిగింది. ఈ చిత్రం ద్వారా స‌త్యానంద్ గారి శిష్యుడు సాయి ఋషి హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. అలాగే వ‌ల‌స చిత్రంలో న‌టించిన తేజు అనుపోజు హీరోయిన్‌గా న‌టిస్తోంది. గ‌ల్ఫ్ మూవీలో ఒక కీల‌క‌పాత్ర‌లో న‌టించిన శివ‌కార్తిక్ మ‌రో మంచి పాత్ర‌లో న‌టిస్తున్నారు. అలాగే వామ‌న‌రావు గారు కూడా ఓ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఆయ‌న‌తో ఈ జ‌ర్నీ వండ‌ర్‌ఫుల్ గా ఉంటుంద‌ని ఆశిస్తున్నాను. న‌వంబ‌ర్ నుండి ఫ‌స్ట్ షెడ్యూల్ ప్రారంభించి హైద‌రాబాద్‌లో చివ‌రి షెడ్యూల్ జ‌ర‌ప‌నున్నాం. డిసెంబ‌ర్‌లో నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రిపి సంక్రాంతికి విడుద‌ల‌చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాం. ప‌ట్ట‌న ప్రాంతాల‌లో ప్ర‌తి ఒక్కరినీ ఆలోచింప‌జేసే క్లాసిక్ ట‌చ్ ఉన్న‌ స‌బ్జెక్ట్ కావ‌డంతో ఓ రొమాంటిక్ క్రైమ్ కథలాగే  మూడు సిరీస్ లుగా  రూపొందించే ఆలోచ‌న‌లో ఉన్నాం. ఈ సినిమా కూడా  మా రొమాంటిక్ క్రైమ్ సిరీస్ లాగే విజయవంతం అవుతుందనిఆశిస్తున్నాం అన్నారు.

నిర్మాత వి వి వామ‌న రావు మాట్లాడుతూ - యూనివ‌ర్స‌ల్ స‌బ్జెక్ట్ కావ‌డంతో టాలెంటెడ్ డైరెక్ట‌ర్ సునీల్ కుమార్ గారికి ఈ కథ వినిపించడం జ‌రిగింది. సునీల్ కుమార్ గారు త‌ప్ప‌కుండా ఈ క‌థ‌కి న్యాయం చేయ‌గ‌ల‌ర‌ని ఆశిస్తున్నాను. మంచి టీమ్ కుదిరింది. త‌ప్ప‌కుండా అంద‌రినీ ఆలోచింప‌జేసే ఒక మంచి సినిమా అవుతుంది అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో హీరో  సాయి ఋషి, హీరోయిన్  తేజు అనుపోజు, న‌టుడు శివ‌కార్తిక్‌, డిఓపి ఎస్‌.వి శివ‌రామ్‌, ఎడిట‌ర్ న‌రేష్ కుమార్ మ‌డికి త‌దిత‌రులు పాల్గొని ప్ర‌సంగించారు.

సాయి ఋషి, తేజు అనుపోజు, శివ కార్తిక్, వి వి వామ‌న ‌రావు త‌దితరులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి పిఆర్ఓ:  సాయి స‌తీష్‌, సినిమాటోగ్రాఫ‌ర్‌: ఎస్‌.వి శివ‌రామ్‌, ఎడిట‌ర్‌: న‌రేష్ కుమార్ మ‌డికి, సంగీతం: ప‌్ర‌వీణ్ ఇమ్మ‌డి, సాహిత్యం: య‌క్క‌లి ర‌వీంద్ర బాబు, క‌థ, స్క్రీన్ ప్లే, నిర్మాత‌:  వి వి వామ‌న ‌రావు, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం:  పి.సునీల్ కుమార్ రెడ్డి.

Sunil Kumar Reddy Honeytrap Movie Launch:

Sunil Kumar Reddy Honeytrap Movie Launch

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ