Advertisementt

అక్కినేని నాగచైతన్య 'థాంక్యూ' చెప్పేస్తున్నాడు!!

Mon 26th Oct 2020 01:02 PM
naga chaitanya,vikram kumar,thank you movie  అక్కినేని నాగచైతన్య 'థాంక్యూ' చెప్పేస్తున్నాడు!!
Naga ChaitanyaThank You Movie Opening అక్కినేని నాగచైతన్య 'థాంక్యూ' చెప్పేస్తున్నాడు!!
Advertisement

యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై 'థాంక్యూ' సినిమా విజయదశమిరోజున లాంఛనంగా ప్రారంభమైంది. 'ఇష్క్‌, మ‌నం, 24' వంటి వైవిధ్య‌మైన చిత్రాల‌ను రూపొందించిన ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె.కుమార్ దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్‌, హర్షిత్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ ఫైనాన్సియర్‌ సత్య రంగయ్య క్లాప్‌ కొట్టారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ - విజయ దశమి అంటే చెడుపై మంచి విజయం సాధించిన రోజు. చాలా మంచిరోజు. అందుకనే మా 'థాంక్యూ' సినిమాను ఈరోజు లాంఛనంగా ప్రారంభించాం. రెగ్యులర్‌ షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించనున్నాం. డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌, చైతన్య కాంబినేషన్‌లో వచ్చిన 'మనం' ఓ క్లాసిక్‌ మూవీగా నిలిచిపోయింది. అలాంటి కాంబినేషన్‌లో సినిమా అనగానే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలుంటాయో తెలిసిందే. ప్రేక్షకాభిమానులను ఆకట్టుకునేలా ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌ని స్టైల్లో స‌రికొత్త‌గా నాగ‌చైత‌న్య‌ను ప్రెజెంట్ చేసేలా సినిమా ఉంటుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాలోని ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తాం అని అన్నారు. 

Naga ChaitanyaThank You Movie Opening:

Naga Chaitanya - Vikram Kumar Thank You Movie Opening

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement