Advertisement

మాయ ఫ‌స్ట్ లుక్, ట్రు టైటిల్ లోగో విడుద‌ల‌!

Maya First Look, True Title Logo Released!

Wed 14th Oct 2020 04:39 PM
maya movie,true movie,maya first look,true title logo released,  మాయ ఫ‌స్ట్ లుక్, ట్రు టైటిల్ లోగో విడుద‌ల‌!
Maya First Look, True Title Logo Released! మాయ ఫ‌స్ట్ లుక్, ట్రు టైటిల్ లోగో విడుద‌ల‌!
Advertisement
      మాయ ఫ‌స్ట్ లుక్ రాజ్ కందుకూరి విడు‌ద‌ల‌చేశారు.
 ప్రవాస భారతీయురాలైన రాధికా జయంతి దర్శకత్వంలో తెర‌కెక్కిన చిత్రం మాయ. సంధ్య బయిరెడ్డి ప్ర‌ధాన పాత్ర‌ పోషించ‌గా, రోహిణి కుమార్, అభిషేక్, ఐడా, మధు, మహిమా ఇత‌ర  పాత్రధారులుగా నటించారు. రేస‌న్ ప్రొడ‌క్ష‌న్స్‌, విఆర్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకాల‌పై గోపికృష్ణ జ‌యంతి  నిర్మించారు.  ప్ర‌ముఖ హాలీవుడ్ సినిమాటోగ్రాఫ‌ర్ డ‌స్టిన్ లీ ఈ చిత్రానికి వ‌ర్క్ చేయ‌డం విశేషం. ఇప్ప‌టికే విడుద‌లైన ప్రీ లుక్ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ రాగా మాయ ఫ‌స్ట్‌లుక్‌ని ఇటీవ‌ల ప్ర‌ముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడు‌ద‌ల‌చేశారు. ఈ ఫ‌స్ట్ లుక్  చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండ‌డంతోపాటు సినిమా మీద క్యూరియాసి‌టీని పెంచి ప్రేక్ష‌కుల‌ని ఇంప్రెస్ చేస్తోంది.
ఈ సంద‌ర్భంగా.. నిర్మాత గోపికృష్ణ జ‌యంతి‌ మాట్లాడుతూ- ప్రీ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ లుక్ కి కూడా మంచి రెస్పాన్స్ వ‌స్తున్నందుకు హ్యాపీగా ఉంది.  పూర్తిగా సినిమా ఇండ‌స్ట్రీ ప‌ట్ల ప్యాష‌నేట్ టీం తో కంప్లీట్‌గా అమెరికాలోని రిచ్ లొకేష‌న్స్‌లో మాయ మూవీ ని  తెర‌కెక్కించ‌డం జ‌రిగింది. మేకింగ్‌లో  హాలీవుడ్ ఇండ‌స్ట్రీలో శిక్ష‌ణ తీసుకున్న రాధిక జ‌యంతి  ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌యం అవుతున్నారు. హాలీవుడ్ సినిమాటోగ్రాఫ‌ర్ డ‌స్టిన్ లీ విజుల‌వ్స్  త‌ప్ప‌కుండా ఆడియ‌న్స్‌ని థ్రిల్ చేస్తాయి. పలు లఘు చిత్రాలకి సంగీతం అందించిన ప్రణీత్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఈ మూవీకి త‌న బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ  మూవీ త‌ప్ప‌కుండా ఆడియ‌న్స్‌కి ఒక మంచి ఎక్స్‌పీరియ‌న్స్ నిస్తుంది అన్నారు.
ద‌ర్శకురాలు రాధిక జ‌యంతి మాట్లాడుతూ- నిర్మాతల స‌హాయంతో అమెరికాలోని రిచ్‌లోకేష‌న్స్‌లో పూర్తి సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రిపాం. ఔట్‌పుట్ చాలా బాగా వ‌చ్చింది. అమెరికాలో సింగ‌ర్‌గా సుప‌రిచితుడు అయిన కార్తిక్ జ‌యంతి ఈ చిత్రానికి క‌థ అందించారు. మిస్ భార‌త్ USA  విన్న‌ర్ సంధ్య టైటిల్‌రోల్ పోషిస్తుండ‌గా  ఫ్యాషన్ దివా  రోహిణి, అభిషేక్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఒక డిఫ‌రెంట్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ గా ఈ మూవీ త‌ప్ప‌కుండా ఆడియ‌న్స్‌ని థ్రిల్ చేస్తుంది. త్వ‌ర‌లోనే టీజ‌ర్ విడుద‌ల‌చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం అన్నారు.
-------------------------------------------------------------------------------------------------------------------
-------------------------------------------------------------------------------------------------------------------
                       ట్రు మూవీ టైటిల్ లోగో విడుద‌ల‌!
గ్రీన్ లీఫ్ ఎంటర్టైన్మెంట్స్ నూతన నిర్మాణ సంస్థలో గుణశేఖర్, సురేందర్ రెడ్డి మరియు వై వి ఎస్ చౌదరి దర్శకుల వద్ద అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసిన శ్యామ్ మండలని దర్శకునిగా పరిచయం చేస్తూ ట్రు అనే సినిమాని నిర్మిస్తున్నారు. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బైలంపుడి మూవీ ఫేమ్ హరీష్ వినయ్, ఉండిపోరాదే ఫేమ్ లావణ్యలు  హీరో, హీరోయిన్ లుగా నటిస్తున్నారు.  ఈ సినిమాలో మెయిన్ విలన్ మధుసూదన్ తో పాటు బాహుబలి  కల్పలత, మణికంఠ,  ఐ డ్రీమ్ టి ఎన్ ఆర్‌, డి ఎస్ రావ్‌, బ్రహ్మానందరెడ్డి, రూపాలక్ష్మి, గని, ఉన్నికృష్ణన్ మరియు శుభోదయం సుబ్బారావు లు నటించారు. బేబీ అక్షిత,  కుందన సంయుక్తంగా  సమర్పిస్తున్న ఈ చిత్రం ఇటీవలే  షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కి సిద్దంగా ఉంది. హరీష్ వినయ్, లావణ్య, మధుసూదన్, కల్పలత, మణికంఠ,  ఐ డ్రీమ్ టిఎన్ఆర్‌, డి. ఎస్ రావ్‌, బ్రహ్మానందరెడ్డి, రూపాలక్ష్మి, గని, ఉన్నికృష్ణన్, శుభోదయం సుబ్బారావు  త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జానకిరామారావు పామరాజు, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ & డైరెక్షన్: శ్యామ్ మండల, నిర్మాత: కె.ఆర్, బ్యానర్: గ్రీన్ లీఫ్ ఎంటర్టైన్మెంట్స్.

maya movie,true movie,maya first look,true title logo released,

Maya First Look, True Title Logo Released!:

Maya First Look, True Title Logo Released!


Loading..
Loading..
Loading..
advertisement