Advertisementt

గ‌మ‌నం ఫ‌స్ట్ లుక్

Mon 05th Oct 2020 11:17 AM
gamanam movie,gamanam first look,shriya saran,nithya menen,shiva kandukuri,priyanka jawalkar,director sujana rao,music mastro illayaraaja,gamanam movie  గ‌మ‌నం ఫ‌స్ట్ లుక్
Gamanam First Look గ‌మ‌నం ఫ‌స్ట్ లుక్
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా ఫిల్మ్ గ‌మ‌నం లో శివ కందుకూరి, ప్రియాంక జ‌వాల్క‌ర్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

సుజ‌నా రావు ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న గ‌మ‌నం చిత్రం రియ‌ల్ లైఫ్ డ్రామాగా రూపొందుతోంది. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా త‌యార‌వుతోంది. చిత్రంలో యువ జంట అలీ, జారా పాత్ర‌ల‌ను పోషిస్తోన్న శివ కందుకూరి, ప్రియాంక జ‌వాల్క‌ర్ ఫ‌స్ట్ లుక్‌ను సోమ‌వారం చిత్ర బృందం విడుద‌ల చేసింది. వైట్ జెర్సీలో క్రీడాకారునిగా శివ క‌నిపిస్తుండ‌గా, సంప్ర‌దాయ దుస్తుల్లో అచ్చ‌మైన ముస్లిం అమ్మాయిగా ప్రియాంక ద‌ర్శ‌న‌మిస్తున్నారు. పోస్ట‌ర్ ప్ర‌కారం, ఆ జంట అంద‌మైన రొమాంటిక్ ల‌వ్ స్టోరీని తెర‌పై మ‌నం చూడ‌నున్నామ‌నే అభిప్రాయం క‌లుగుతోంది. గ‌మ‌నం కు సంబంధించి ఇదివ‌ర‌కు విడుద‌ల చేసిన శ్రియా శ‌ర‌న్‌, నిత్యా మీన‌న్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ల‌కు అద్వితీయ‌మైన స్పంద‌న ల‌భించింన విష‌యం విదిత‌మే. ఇప్పుడు శివ కందుకూరి, ప్రియాంక జ‌వాల్క‌ర్ జోడీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌తో డ‌బుల్ ధ‌మాకా అందించింది చిత్ర బృందం. ప్ర‌ముఖ ర‌చ‌యిత సాయిమాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌లు రాస్తున్న ఈ చిత్రానికి మేస్ల్రో ఇళ‌యారాజా సంగీత స్వ‌రాలు అందిస్తున్నారు. వి.ఎస్‌. జ్ఞాన‌శేఖ‌ర్ ఒక‌వైపు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తూనే, ర‌మేష్ క‌రుటూరి, వెంకీ పుష‌డ‌పు ల‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ‌మ‌నం షూటింగ్ మొత్తం ఇప్ప‌టికే పూర్త‌వ‌గా, ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఈ చిత్రానికి ప‌నిచేస్తున్న ఇత‌ర తారాగ‌ణం, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు.

తారాగ‌ణం: శ్రియా శ‌ర‌న్‌, నిత్యా మీన‌న్‌, శివ కందుకూరి, ప్రియాంక జ‌వాల్క‌ర్‌.

నిర్మాత‌లు: ర‌మేష్ క‌రుటూరి, వెంకీ పుష‌డ‌పు, జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్‌.

క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  సుజ‌నా రావు.

Gamanam First Look:

Gamanam First Look

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ