Advertisement

ఆ ‘బ్యూటీ గర్ల్’ మూవీ అప్డేట్ ఇదే..!

Wed 23rd Sep 2020 10:35 PM
beauty girl movie,lakshmi narayana cinema,vemuganti director,devadas narayana  ఆ ‘బ్యూటీ గర్ల్’ మూవీ అప్డేట్ ఇదే..!
Beauty Girl movie Shooting Update ఆ ‘బ్యూటీ గర్ల్’ మూవీ అప్డేట్ ఇదే..!
Advertisement

ఫస్ట్ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ‘బ్యూటీ గర్ల్’

లక్ష్మీ నారాయణ సినిమా పతాకంపై అల్తాఫ్, అర్చనా గౌతమ్ హీరోహీరోయిన్లుగా.. వేముగంటి దర్శకత్వంలో ప్రముఖ షోలాపూర్ డిస్ట్రిబ్యూటర్ దేవదాస్ నారాయణ నిర్మిస్తోన్న చిత్రం ‘బ్యూటీ గర్ల్’. ఈ చిత్రం ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తూ.. షూటింగ్ జరుపుకుని ఫస్ట్ షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మీడియాకు చిత్ర విశేషాలను తెలిపింది.

ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత దేవదాస్ నారాయణ మాట్లాడుతూ.. ‘‘షోలాపూర్‌లో నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూటర్‌గా 400కి పైగా పెద్ద సినిమాలు రిలీజ్ చేశాను. ఆ అనుభవంతో ఈ ‘బ్యూటీ గర్ల్’ సినిమాను నిర్మిస్తున్నాను. మా డైరెక్టర్ వేముగారి దర్శకత్వంలో ఈ సినిమా అద్భుతంగా రాబోతుంది. అన్ని కమర్షియల్ అంశాలు ఈ చిత్రంలో ఉండబోతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. షూటింగ్ చేస్తున్నాము. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. త్వరలోనే రెండో షెడ్యూల్ ప్రారంభిస్తాము. సినిమా బాగా వస్తుంది. ప్రేక్షకులకు కావలసిన ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రంలో పుష్కలంగా ఉంటుంది..’’ అని తెలిపారు.

అల్తాఫ్, అర్చనా గౌతమ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి

బ్యానర్: లక్ష్మీ నారాయణ సినిమా

సంగీతం: ఏలేంద్ర మహావీర్

కెమెరా: మురళీ కృష్ణ. వై

నిర్మాత: దేవదాస్ నారాయణ

దర్శకత్వం: వేముగంటి.

Beauty Girl movie Shooting Update:

Beauty Girl movie Press Meet details 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement