Advertisement

రీల్ స్టార్ రియల్ స్టోరీతో తెరకెక్కిన ‘లేడీ’

Tue 18th Aug 2020 12:24 AM
maadhavi latha,solo perfomance,mono action,lady,lady movie  రీల్ స్టార్ రియల్ స్టోరీతో తెరకెక్కిన ‘లేడీ’
Maadhavi latha in LADY A real life of a reel star రీల్ స్టార్ రియల్ స్టోరీతో తెరకెక్కిన ‘లేడీ’
Advertisement

మాధవి లత హీరోయిన్‌గా ఓ రీల్ స్టార్ రియల్ స్టోరీతో తెరకెక్కిన ‘లేడీ’  

ప్రముఖ హీరోయిన్ మాధవి లత సోలో పెర్ఫార్మన్స్‌లో మోనో ప్లే పద్ధతిని అనుసరించి జీఎస్ఎస్ఎస్‌పి కళ్యాణ్ డైరెక్షన్‌లో రూపొందుతున్న రియల్ లైఫ్ థ్రిల్లింగ్ ఎమోషనల్ డ్రామా ‘లేడీ’. ఈ మోనో ప్లే ఎక్సపెరిమెంటల్ మూవీని ఛరన్స్ క్రియేషన్స్, జీఎస్ఎస్ఎస్‌పీకే స్టూడియోజ్ బ్యానర్లపై సత్యనారాయణ గొరిపర్తి, జీఎస్ఎస్ఎస్‌పి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఒకే ఒక క్యారెక్టర్‌తో ఈ సినిమా తెరకెక్కినట్లుగా దర్శకుడు కళ్యాణ్ తెలిపారు. అలానే ఓ రీల్ స్టార్ రియల్ స్టోరీతో ఈ సినిమాను రెడీ చేస్తున్నామన్నారు కళ్యాణ్. సినిమా ఆద్యంతం సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎపిసోడ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిన తీర్చిదిద్దినట్లుగా కళ్యాణ్ చెప్పారు. ఈ సినిమాకి మాధవి లత నటన ప్రధాన ఆకర్షణగా నిలవబోతుందని, సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నట్లుగా చిత్రం బృందం తెలిపింది. చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా నిర్మాత సత్యనారాయణ చెప్పారు.

తారాగణం : మాధవి లత

సాంకేతిక వర్గం

బ్యానర్: చరణ్స్ క్రియేషన్స్, జీ ఎస్ ఎస్ ఎస్ పీ కే స్టూడియోజ్

కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, వి ఎఫ్ ఎక్స్, డిఐ, పబ్లిసిటీ డిజైన్స్: జీ ఎస్ ఎస్ ఎస్ పీ కళ్యాణ్

మ్యూజిక్: వినోద్ యాజమాన్య

పిఆర్ఓ: ఏలూరు శ్రీను

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వేణు కార్తికేయన్

ప్రొడ్యూసర్స్: జీ ఎస్ ఎస్ ఎస్ పి కళ్యాణ్, సత్యనారాయణ గొరిపర్తి

Maadhavi latha in LADY A real life of a reel star :

Maadhavi latha solo perfomance and mono action thrilling emotiomal drama LADY

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement