Advertisementt

‘పొగ‌రు’ చిత్రంలోని ఫ‌స్ట్ సాంగ్ విడుదల

Fri 07th Aug 2020 04:45 PM
dhruva sarja,rashmika mandanna,pogaru first song,karabu  ‘పొగ‌రు’ చిత్రంలోని ఫ‌స్ట్ సాంగ్ విడుదల
Pogaru First Song Karabu Released ‘పొగ‌రు’ చిత్రంలోని ఫ‌స్ట్ సాంగ్ విడుదల
Advertisement
Ads by CJ

ధ్రువ స‌ర్జా, ర‌ష్మికా మంద‌న్న న‌టిస్తోన్న ‘పొగ‌రు’ చిత్రంలోని ఫ‌స్ట్ సాంగ్ ‘క‌రాబు’ విడుద‌ల‌

యాక్ష‌న్ కింగ్ అర్జున్ మేన‌ల్లుడు, క‌న్న‌డ చిత్ర‌సీమ‌లోని స్టార్ యాక్ట‌ర్ల‌లో ఒక‌రైన ధ్రువ స‌ర్జా హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ పాన్ ఇండియ‌న్ ఫిల్మ్ ‘పొగ‌రు’. తెలుగులోనూ ఇదే పేరుతో రానున్న‌ది. హ్యాట్రిక్ యాక్ష‌న్ ప్రిన్స్‌గా పేరుపొందిన ధ్రువ స‌ర‌స‌న నాయిక పాత్ర‌ను ర‌ష్మికా మంద‌న్న పోషిస్తున్నారు. యాక్ష‌న్ ఎంటర్‌టైన‌ర్‌గా త‌యారవుతున్న ‘పొగ‌రు’కు నంద‌కిశోర్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. ‘విక్ట‌రీ’, ‘అధ్య‌క్షా’, ‘ర‌న్న‌’, ‘ముకుంద మురారి’ వంటి హిట్ సినిమాల డైరెక్ట‌ర్‌గా నంద‌కిశోర్ మంచి పేరు సంపాదించారు. డిస్ట్రిబ్యూట‌ర్‌గా 100కు పైగా చిత్రాల‌ను పంపిణీ చేసి, ‘అధ్య‌క్షా’ వంటి హిట్ మూవీని నిర్మించిన బి.కె. గంగాధ‌ర్ ‘పొగ‌రు’ చిత్రాన్ని గ్రాండియ‌ర్‌గా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలోని మొద‌టి పాట ‘క‌రాబు’ను గురువారం యూట్యూబ్‌లో విడుద‌ల చేశారు. ఈ పాట విడుద‌ల‌తో తెలుగు వెర్ష‌న్ ప్ర‌మోష‌న్స్‌ను ప్రారంభించారు. పాపుల‌ర్ క‌న్న‌డ మ్యూజిక్ డైరెక్ట‌ర్ చంద‌న్ శెట్టి స‌మ‌కూర్చిన మాస్ బీట్స్ ఉర్రూత‌లూగించే విధంగా ఉన్నాయి. హీరో క్యారెక్ట‌రైజేష‌న్ ఏమిట‌నేది ఈ పాట సాహిత్యం తెలియ‌జేస్తోంది. హీరోయిన్ ర‌ష్మిక‌ను టీజ్ చేస్తూ ధ్రువ స‌ర్జా వేసిన స్టెప్స్‌, ఆయ‌న విన్యాసాలు ఆక‌ట్టుకుంటున్నాయి. ర‌ష్మిక చూడ‌ముచ్చ‌ట‌గా, అమాయ‌కంగా క‌నిపిస్తోంది. ఈ సాంగ్‌కు ముర‌ళి కొరియోగ్ర‌ఫీ అందించారు. సినిమాటోగ్రాఫ‌ర్‌గా ఎస్‌.డి. విజ‌య్ మిల్ట‌న్‌, ఎడిట‌ర్‌గా కె.ఎం. ప్ర‌కాష్ ప‌నిచేస్తున్నారు.

ధ్రువ స‌ర్జా, ర‌ష్మికా మంద‌న్న‌, సంప‌త్ రాజ్‌, ధ‌నంజ‌య్‌, ర‌విశంక‌ర్‌, ప‌విత్రా లోకేష్‌, గిరిజా లోకేష్‌, చిక్క‌న్న‌, రాఘ‌వేంద్ర రాజ్‌కుమార్‌, క‌రి సుబ్బు, ధ‌ర్మా, మ‌యూరి, త‌బ‌లా నాని, కై గ్రీన్‌, మోర్గాన్ ఆస్టే, జో లిండ్న‌ర్‌, జాన్ లూకాస్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి 

సాంకేతిక బృందం:

సంగీతం: చ‌ంద‌న్ శెట్టి

సినిమాటోగ్రీఫీ: ఎస్‌.డి. విజ‌య్ మిల్ట‌న్‌

ఎడిటింగ్‌: కె.ఎం. ప్ర‌కాష్‌

నిర్మాత‌: బి.కె. గంగాధ‌ర్‌

ద‌ర్శ‌క‌త్వం: న‌ంద‌కిశోర్‌

బ్యాన‌ర్‌: శ్రీ జ‌గ‌ద్గురు మూవీస్‌

Pogaru First Song Karabu Released:

Dhruva Sarja, Rashmika Mandanna Starrer Pogaru First Song Karabu Is Out

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ