Advertisementt

‘త్రికోణం’ మూవీ మోషన్ పోస్టర్ విడుదల

Tue 04th Aug 2020 06:44 PM
good response,trikonam movie,motion poster  ‘త్రికోణం’ మూవీ మోషన్ పోస్టర్ విడుదల
Trikonam movie motion poster released ‘త్రికోణం’ మూవీ మోషన్ పోస్టర్ విడుదల
Advertisement
Ads by CJ

సీనియర్ నటి లక్ష్మీ, సురేష్ హెబిల్కర్, అచ్యుత్ కుమార్, సుధారాణి నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘‘త్రికోణం’’. చంద్రకాంత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మూడు భాషల్లో రిలీజ్ కానుంది. తెలుగు, కన్నడ మరియు తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. పోలీస్ ప్రాకి ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాజశేఖర్ ఈ సినిమాను నిర్మించారు. ఇటీవల రిలీజైన మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. గ్రాండ్ లెవల్లో ఉన్న ఈ మోషన్ పోస్టర్ ను కొత్తగా డిజైన్ చేశారు. 

హార్రర్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చే క్రూరంగా కనిపించే విలన్, అడవి బ్యాక్ గ్రౌండ్ ఇలాంటి థ్రిల్లింగ్ అంశాలతో ఈ మోషన్ పోస్టర్ ను రూపొందించారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీ లో ఎమోషన్స్ ప్రధానంగా ఉండబోతున్నాయి. మూడు భాషల్లో తెరకెక్కుతున్న ‘‘త్రికోణం’’ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుటుంది. థియేటర్ లు ఓపెన్ అవ్వగానే డైరెక్ట్ గా థియేటర్లలోనే రిలీజ్ చేస్తామంటున్నారు ప్రొడ్యూసర్. థియేటర్‌లో చూస్తేనే ఈ సినిమా క్వాలిటీ, సౌండ్ డిజన్, గ్రాఫిక్స్ ఆకట్టుకుంటాయంటున్నారు.

Trikonam movie motion poster released:

Good response for Trikonam movie motion poster

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ