నందిత శ్వేత ‘IPC 376’కు మంచి ఆఫర్స్!

IPC 376 Movie getting good offers from business circles

Tue 28th Jul 2020 06:27 PM
nandita swetha,ipc 376 movie,good offers,business circles  నందిత శ్వేత ‘IPC 376’కు మంచి ఆఫర్స్!
IPC 376 Movie getting good offers from business circles నందిత శ్వేత ‘IPC 376’కు మంచి ఆఫర్స్!
Advertisement

నందిత శ్వేత ‘IPC 376’ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్, బిజినెస్ సర్కిల్స్‌లో మంచి ఆఫర్లు

పవర్ కింగ్ స్టూడియో బ్యానర్ పై ఎస్.ప్రభాకర్ సమర్పణలో హీరోయిన్ నందిత శ్వేతా ప్రధాన పాత్రలో వస్తోన్న చిత్రం ‘IPC 376’. రాజ్ కుమార్ సుబ్రమన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగు, తమిళంలో తెరకెక్కింది. ఈ మూవీ ట్రైలర్ రీసెంట్‌గా రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో ఆద్యంతం ఆకట్టుకునేలా ఉందీ ట్రైలర్. అంతే కాదు ట్రైలర్ రిలీజయిన వెంటనే అటు తెలుగు, తమిళ ఇండస్ట్రీ నుండి మూవీ ఆఫీస్‌కు బిజినెస్ కోసం ఆఫర్లు వస్తున్నాయని చిత్రయూనిట్ తెలిపింది. శాటిలైట్, డిజిటల్ రైట్స్ కోసం కాల్స్ వస్తుండటం సంతోషంగా ఉందంటున్నారు మేకర్స్. త్వరలోనే ఒక మంచి డీల్ ఫిక్స్ చేసి బిజినెస్ క్లోజ్ చేస్తామంటున్నారు నిర్మాత ప్రభాకర్.

ఒక బంగ్లాలో జరిగే అనూహ్య ఘటనలు పోలీసులకు ఎలాంటి సవాళ్లు విసిరాయి? అనే కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నందిత శ్వేత నటించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకంటున్న ఈ మూవీ థియేటర్లు ఓపెన్ అవ్వగానే సినిమా రిలీజ్ కానుంది.

IPC 376 Movie getting good offers from business circles:

Nandita swetha starrer IPC 376 Movie getting good offers from business circles


Loading..
Loading..
Loading..
advertisement