ఒరేయ్ బుజ్జిగా ఇది ఎంటర్ టైనర్!

Thu 12th Mar 2020 12:29 PM
orey bujjiga movie matter,orey bujjiga movie press meet,orey bujjiga movie press meet photos,orey bujjiga movie press meet pics,orey bujjiga movie  ఒరేయ్ బుజ్జిగా ఇది ఎంటర్ టైనర్!
Entertainer as Orey Bujjiga.. ఒరేయ్ బుజ్జిగా ఇది ఎంటర్ టైనర్!
Sponsored links


యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో  శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న యూత్‌ ఎంటర్‌టైనర్‌ ఒరేయ్‌ బుజ్జిగా... ఉగాది కానుకగా మార్చి 25న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌వుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో...

యంగ్ హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ  - "ఒరేయ్ బుజ్జిగా` ఒక కంప్లీట్ ఎంటర్ టైనర్. టీమ్ అందరూ ఎంతో ఫ్యాషన్ తో సినిమాని ముందుకు తీసుకెళ్లారు.  థియేటర్ లో సినిమా చూసి రెండున్నర గంటలు నవ్వుతూనే ఉంటారు. మార్చి 25న సినిమా విడుదలవుతుంది. ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ వస్తాయి. ఫ్యామిలీ అంతా వచ్చి హ్యాపీ గా నవ్వుకుని వెళ్లే సినిమా. ప్రతి ఒక్కరూ థియేటర్ లోనే సినిమా చూడండి. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత రాధా మోహన్ గారికి, దర్శకుడు విజయ్ కుమార్ గారికి ధ‌న్యవాదాలు" అన్నారు.

హీరోయిన్ మాళవిక నాయర్ మాట్లాడుతూ  - సినిమా ఒక టీమ్ క్రాఫ్ట్ అని అంటారు. నాకు తెలుగు రాకపోయినా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి సినిమా ఇంకా బాగా రావడానికి హెల్ప్ చేశారు. విజయ్ కుమార్ గారు సినిమా బిగినింగ్ నుండి నాకు గైడింగ్ స్పిరిట్ గా ఉన్నారు. ఆయన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంద‌రికీ ఒక హ్యుజ్ ఇన్‌స్పిరేషన్. ఆయన వల్లే టీమ్ అందరం ఇంత బాగా పెర్ఫామ్ చేయగలిగాం. మా నిర్మాత రాధామోహన్ గారు మేకింగ్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అలాగే ప్రమోషన్స్ కూడా వినూత్నంగా చేస్తున్నారు. నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. రాజ్ తరుణ్ మంచి ఈజ్ తో నటించారు.  ఆండ్రూ గారితో  వర్క్ చేయడం అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్. సినిమాలో మంచి హ్యూమర్ ఉంటుంది. మార్చి 25న సినిమా విడుద‌ల‌వుతుంది.  అందరు తప్పకుండా చూడండి అన్నారు.

దర్శకుడు కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ - మా నిర్మాత రాధా మోహన్ గారితో చాలా కాలంగా మంచి అనుబంధం ఉంది. చాలా మంచి నిర్మాత. కథకు ఏమి కావాలో అన్ని ఇచ్చి నాకు సపోర్ట్ చేశారు. సినిమాలో హ్యుజ్ ప్యాడింగ్‌ ఉంది. అందరు చక్కగా నటించారు. ముఖ్యంగా రాజ్ తరుణ్ మన పక్కింటి కుర్రాడిలా ఉంటాడు. హండ్రెడ్ పర్సెంట్ ఆయనకి తగిన సినిమా.  మాళవిక నాయర్ న్యాచురల్ ఆర్టిస్ట్. ప్రతి ఒక్కరు ఇది నా సినిమా అని ఓన్ చేసుకొని అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. సినిమాలో అన్ని క్యారెక్టర్స్ కి జస్టిఫికేషన్ ఉంటుంది. అలాగే ఆండ్రూగారు, అనూప్ ఇలా అందరు మంచి మంచి టెక్నీషియ‌న్స్‌ కుదిరారు. ఏ జోనర్ లో సినిమా చేయాలని మూడు సంవత్సరాలుగా నాలో నేను మధన పడి,  ఆడియన్స్ అందరూ పడి పడి నవ్వుకునే సినిమా చేయాలని ఒరేయ్ బుజ్జిగా చేయడం జరిగింది. ఉగాది పచ్చడిలో ఎలాగైతే షడ్రుచులు ఉంటాయో ఈ సినిమాలో కూడా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ ఉగాదికి మీ ముందుకు వస్తున్నాం. మీ అందరి ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర నిర్మాత కె.కె. రాధా మోహన్ మాట్లాడుతూ - "ఒరేయ్ బుజ్జిగా` నేను, విజయ్ కుమార్ స్టార్ బక్స్ లో కాఫీ తాగుతున్నప్పుడు ఈ స్టోరీ నేరేట్ చేశారు. అక్కడ స్టార్ట్ అయిన సినిమా ఈ ఉగాదికి పచ్చడిలా వస్తుంది. మా ఒరేయ్ బుజ్జిగా టైటిల్ బాగా పాపులర్ అయింది. ఇప్పటికే విడుదలైన `కురిసెన, కురిసెన` పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. యూత్ కి, ఫ్యామిలీస్ కి నచ్చే అన్ని రకాల కమ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా. ఇప్పటివరకు సినిమా చూసిన వారుకూడా చాలా ఎంటర్టైనింగ్ గాఉంది అని చెప్పారు. నంద్యాల రవి గారు మంచి డైలాగ్స్ రాశారు. అలాగే ఎడిటర్ ప్రవీణ్ చక్కగా ఎడిట్ చేశారు. విజయ్ కుమార్ గారు పక్కగా ప్రీ ప్రొడక్షన్ చేసుకోవడం వల్ల సినిమాకి అవసరమైన సన్నివేశాలే తీశారు. దాని వల్ల వర్కింగ్ డేస్ తగ్గి నిర్మాతలకి మంచి జరుగుతుంది. ఈ సినిమాకి యంగ్ టీమ్ వర్క్ చేయడం వల్ల అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ నాకు మంచి మిత్రుడు. ఈ సినిమాకి బ్రహ్మాండమైన ట్యూన్స్ ఇచ్చారు. వాణి విశ్వనాధ్ గారు హీరోయిన్ తల్లిగా ఒక ముఖ్యమైన పాత్ర చేశారు. ఆమెకు కూడా తెలుగులో మంచి రీఎంట్రీ అవుతుంది. పోసాని, నరేష్, సత్య ఇలా చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు ఈ సినిమాలో నటించారు. ఈ ఉగాది కానుగా మర్చి 25న సినిమా విడుదల చేస్తున్నాం. ఇప్పటికే మేము మొదలు పెట్టిన మొబైల్ పబ్లిసిటీ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే ఈ సినిమాకి మార్చి 14న కరీంనగర్ లో, 19న తిరుపతిలో, 21 హైదరాబాద్ లో మూడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్  చేస్తున్నాం. అలాగే 16 నుండి ఖమ్మం, విజయవాడ, భీమవరం, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ లో  కాలేజ్ విజిట్స్  చేస్తున్నాం. ఇటీవలే అరకు, గుంటూరులో జరిగిన ఈవెంట్స్‌ కి మేము అందరం వెళ్లడం జరిగింది. మార్చి 25 శార్వ‌రినామ సంవత్సర ఉగాదికి మా సినిమా వస్తుంది. ప్రేక్ష‌కుల‌కి హండ్రెడ్ ప‌ర్సెంట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించే సినిమా. అందరూ చూసి ఆదరించాల్సిందిగా కోరుకుంటున్నాను అన్నారు.

Sponsored links

Entertainer as Orey Bujjiga..:

Releasing worldwide on the 25th Orey Bujjiga..

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019