ప్రాణంఖరీదు పెద్ద హిట్ కావాలి

Sun 10th Mar 2019 01:28 PM
pranam khareedu,tarakaratna,avanthika  ప్రాణంఖరీదు పెద్ద హిట్ కావాలి
Pranam Khareedu Pre Release Event ప్రాణంఖరీదు పెద్ద హిట్ కావాలి
Sponsored links

ప్రాణంఖరీదు పెద్ద హిట్ కావాలి...

                    -  అతిధుల ఆకాంక్ష

తారకరత్న ముఖ్యపాత్రలో ప్రశాంత్ హీరోగా అవంతిక హీరోయిన్ గా ఎన్ యస్ క్రియేషన్స్ పతాకంపై పియల్ కె రెడ్డి దర్శకత్వంలో  నల్లమోపు సుబ్బారెడ్డి నిర్మించిన చిత్రం ప్రాణంఖరీదు. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. ఈ సందర్బంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఆడియో ఫంక్షన్ ని గ్రాండ్ గా జరిపారు. వందేమాతరం శ్రీనివాస్ సంగీత సారథ్యంలో రూపొందిన   ప్రాణంఖరీదు ఆడియో సీడీలను ప్రముఖ నిర్మాత కె.యల్.దామోదర ప్రసాద్ ఆవిష్కరించారు. మ్యాంగో మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైయింది. 

చిత్ర నిర్మాత నల్లమోపు సుబ్బారెడ్డి మాట్లాడుతూ..  సినిమా బాగా వచ్చింది. ఆడియెన్స్ ని ఎంటర్ టైన్ చేసేవిధంగా ఉంటుంది. ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను.. అన్నారు.

 దర్శకుడు పి.యల్.కె రెడ్డి మాట్లాడుతూ.. మా టీం అందరి సహకారంతో ఈ చిత్రాన్ని బాగా తెరకెక్కించాం. మా నిర్మాత సుబ్బారెడ్డి గారు అన్నివిధాలుగా సహకరించి సపోర్ట్ చేశారు. వందేమాతరం శ్రీనివాస్ మంచి సాంగ్స్ ఇచ్చారు. హీరో ప్రశాంత్ యాక్షన్ సీన్స్, సెంటిమెంట్ సీన్స్ లో అద్భుతంగా చేసాడు. అలాగే అవంతిక మేము ఎక్స్ పెక్ట్ చేసిన దానికన్నా బాగా చేసింది. సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను.. అన్నారు.

హీరో ప్రశాంత్ మాట్లాడుతూ... సినిమా నాకోసం ఈ సినిమా కి వర్క్ చేసిన అందరికీ నా థాంక్స్. మా చిత్రం ఎవరినీ డిజపాయింట్ చేయదు. ఖచ్చితంగా అందరినీ అలరిస్తుంది..అన్నారు.

ప్రముఖ నిర్మాత కె.ఎల్.దామోదర ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రశాంత్ యు యస్ లో జాబ్ చేస్తూ సినిమా మీద ప్యాషన్ తో ఈ చిత్రంలో హీరోగా నటించాడు. సినిమా చూసాను. ప్రశాంత్  బాగా పెర్ఫార్మెన్స్ చేసాడు. ఒక మంచి ఆర్టిస్ట్ ఇండస్ట్రీకి వస్తున్నాడు. చిన్న సినిమాని సపోర్ట్ చేసి అందరూ ఎంకరేజ్ చేయాలి.. అన్నారు. 

హీరోయిన్ అవంతిక మాట్లాడుతూ.. ఇది నా మూడో చిత్రం. ఈ చిత్రంలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా థాంక్స్ అన్నారు.

Sponsored links

Pranam Khareedu Pre Release Event :

Pranam Khareedu Pre Release Event 

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019