బిగ్‌బాస్ విన్న‌ర్ నటిస్తున్న ‘రాజ భీమా’ ఫ‌స్ట్ లుక్

Sat 15th Sep 2018 07:19 PM
bigg boss,winner,aarav,film rajabheema,first look  బిగ్‌బాస్ విన్న‌ర్ నటిస్తున్న ‘రాజ భీమా’ ఫ‌స్ట్ లుక్
RajaBheema Movie First Look Released బిగ్‌బాస్ విన్న‌ర్ నటిస్తున్న ‘రాజ భీమా’ ఫ‌స్ట్ లుక్
Sponsored links

రియాలిటీ షోల్లో బిగ్ బాస్ ఎంత‌టి సంచ‌ల‌నం క్రియేట్ చేస్తోందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌మిళంలో క‌మ‌ల్ హాస‌న్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన‌ బిగ్ బాస్ సీజ‌న్ 1లో విజేత ఆర‌వ్ ఇప్పుడు వెండితెర‌పై సంద‌డి చేయ‌నున్నారు. ఆర‌వ్ హీరోగా న‌టిస్తున్న చిత్రం ‘రాజ భీమా’. సుర‌భి ఫిలింస్ బ్యాన‌ర్‌పై న‌రేశ్ సంప‌త్ ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.మోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు. 

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత ఎస్‌.మోహ‌న్ మాట్లాడుతూ.. ‘‘ఆర‌వ్‌ను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ  మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా భారీ బ‌డ్జెట్‌తో.. వైవిధ్య‌మైన క‌థాంశంతో.. బ్యూటీఫుల్ లొకేష‌న్స్‌లో రాజ భీమా చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ద‌ర్శ‌కుడు న‌రేశ్ సంప‌త్ అద్భుత‌మైన క‌థ‌, క‌థ‌నంతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాం. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన మ‌రిన్ని విష‌యాల‌ను తెలియ‌జేస్తాం’’ అన్నారు. 

ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ: ఎస్‌.ఆర్‌.స‌తీశ్ కుమార్‌, మ్యూజిక్‌:  సైమాన్ కె.కింగ్‌, ఎడిటింగ్‌:  గోపీ కృష్ణ‌, స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌:  క‌రుణ్‌దేల్ రాజేశ్‌, ఆర్ట్‌:  ఎ.ఆర్‌.మోహ‌న్‌, స్టంట్స్‌: హ‌రి దినేశ్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  కె.బి.బ‌షీర్ అహ్మద్‌, ప్రొడ్యూస‌ర్‌: ఎస్‌.మోహ‌న్‌, ద‌ర్శ‌క‌త్వం: న‌రేశ్ సంప‌త్‌. 

Sponsored links

RajaBheema Movie First Look Released:

Bigg Boss Winner Aarav Film Rajabheema first Look

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019