ఆగ‌స్ట్ 31న న‌య‌నతార 'కో.. కో.. కోకిల‌'!!

Sat 25th Aug 2018 07:25 AM
nayanatara,coco kokila,kolamavu kokila  ఆగ‌స్ట్ 31న న‌య‌నతార 'కో.. కో.. కోకిల‌'!!
CoCo Kokila Releasing on August 31st ఆగ‌స్ట్ 31న న‌య‌నతార 'కో.. కో.. కోకిల‌'!!
Sponsored links

లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార టైటిల్ పాత్ర‌ధారిగా నెల్సన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించిన చిత్రం `కో..కో..కోకిల‌`. ఇటీవ‌ల త‌మిళంలో `కోల‌మావు కోకిల‌` పేరుతో విడుద‌లైన ఈ చిత్రం సెన్సేష‌న‌ల్ హిట్ టాక్‌తో.. అద్వితీయ‌మైన క‌లెక్ష‌న్స్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగులో `కో..కో..కోకిల‌` పేరుతో ఆగ‌స్ట్ 31న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా...

లైకా ప్రొడ‌క్ష‌న్స్ ప్ర‌తినిధి మాట్లాడుతూ - ``ప్ర‌స్తుతం ద‌క్షిణాది లేడీ సూప‌ర్‌స్టార్‌గా నయ‌న‌తార‌గారికి ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆమె న‌టించిన కో కో కోకిల సినిమాకు స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు క‌ర‌ణ్ జోహార్‌తో పాటు స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌, సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ మా సినిమా చూసి అభినందించారు. వారి అభినంద‌నలు మాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చాయి.  ఓ సాధార‌ణ‌మైన అమ్మాయి.. ఓ స్మ‌గ్లింగ్ గ్యాంగ్ చేతిలో అనుకోకుండా చిక్కుకుపోతుంది. అటువంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల నుండి ఆమె ఎలా బ‌య‌ట‌ప‌డింద‌నేదే  పాయింట్‌ను డైరెక్ట‌ర్ నెల్స‌న్ ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించారు. ఈ సినిమా త‌మిళంలో తిరుగులేని విజ‌యాన్ని సొంతం చేసుకుంది. యోగిబాబు కామెడీ సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ కానుంది. శివకుమార్ విజ‌య‌న్ సినిమాటోగ్ర‌ఫీ .. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ మ్యూజిక్‌.. నెల్స‌న్ టేకింగ్‌.. న‌య‌న‌తార న‌ట‌న సినిమాకు పెద్ద ఎసెట్‌గా నిలిచాయి. ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్ 31న తెలుగులో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం`` అన్నారు. 

న‌య‌న‌తార, యోగిబాబు, శ‌ర‌ణ్య పొన్‌వ‌న్న‌న్ తారాగ‌ణంగా న‌టించిన ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ ర‌విచంద్ర‌న్‌, కెమెరా:  శివ‌కుమార్ విజ‌య‌న్‌, నిర్మాణం:  లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, ద‌ర్శ‌క‌త్వం:  నెల్స‌న్‌.

Sponsored links

CoCo Kokila Releasing on August 31st:

Nayanatara's CoCo Kokila Releasing on August 31st

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019