‘సుబ్రహ్మణ్యపురం’ సెన్సేషన్ మొదలైంది

Mon 20th Aug 2018 04:40 PM
subrahmanyapuram,sumanth,country side pictures,overseas rights  ‘సుబ్రహ్మణ్యపురం’ సెన్సేషన్ మొదలైంది
Fancy Rate To SubrahmanyaPuram Overseas Rights ‘సుబ్రహ్మణ్యపురం’ సెన్సేషన్ మొదలైంది
Sponsored links

నిర్మాణంలో ఉండగానే అందరి దృష్టిని ఆకర్షిస్తూ.. అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తున్న హీరో సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. ఈ చిత్ర ఓవర్సీస్ హక్కులు ఫ్యాన్సీ రేటుతో కంట్రీసైడ్ పిక్చర్స్ అధినేతలు దక్కించుకున్నారు. ఇప్పటి వరకు సుమంత్ కెరీర్‌లో ఓవర్సీస్ హక్కులకు లభించని ఫ్యాన్సీ అమౌంట్ ఈ చిత్రానికి దక్కడం విశేషం. సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రై. లిమిటెడ్ పతాకంపై బీరం సుధాకర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈషా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

ఈ సందర్భంగా నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. సూపర్ న్యాచురల్ అంశాల మేళవింపుతో సాగే మిస్టరీ థ్రిల్లర్ చిత్రమిది. తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ ప్రేక్షకులకు కలిగిస్తుంది. అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో 30 నిమిషాల పాటు ఉండే గ్రాఫిక్స్ ప్రేక్షకులకు థ్రిల్‌ను కలిగిస్తాయి. తెలుగులో బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచిన బాహుబలి, గరుడవేగ, రంగస్థలం చిత్రాలకు పనిచేసిన వీఎఫ్‌ఎక్స్ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. సుమంత్ కెరీర్‌లో ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా ఫ్యాన్సీ రేటుకు ఓవర్సీస్ హక్కులు అమ్ముడుపోయాయి. తప్పకుండా చిత్రం అందర్నీ అలరిస్తుందనే నమ్మకం ఉంది..అని అన్నారు.

Sponsored links

Fancy Rate To SubrahmanyaPuram Overseas Rights:

Sumanth SubrahmanyaPuram sensation Starts

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019