Advertisementt

స‌ప్తగిరి సినిమాకి టైటిల్ ఫిక్సయింది!

Mon 09th Jul 2018 12:27 PM
saptagiri,new movie,title,gajadonga  స‌ప్తగిరి సినిమాకి టైటిల్ ఫిక్సయింది!
Saptagiri Next Movie Title As Gajadonga స‌ప్తగిరి సినిమాకి టైటిల్ ఫిక్సయింది!
Advertisement
Ads by CJ

'స‌ప్త‌గిరి ఎక్స్ ప్రెస్‌', 'స‌ప్త‌గిరి ఎల్‌.ఎల్‌.బి' చిత్రాల‌తో హీరోగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన శైలిని, మార్కెట్‌ని సొంతం చేసుకున్నారు టాప్ క‌మెడియ‌న్ స‌ప్త‌గిరి. ఆయ‌న హీరోగా 'గ‌జ‌దొంగ‌' పేరుతో ఓ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ రూపొంద‌నుంది. నంద నంద‌నా ప్రాజెక్ట్స్ ప‌తాకంపై శ‌ర్మ చుక్కా, యెడల నరేంద్ర, G .V .N .రెడ్డి  చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. గీతా ఆర్ట్స్, సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ‌ల్లో ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన డి.రామ‌కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాతలు శ‌ర్మ చుక్కా, యెడల నరేంద్ర, G .V .N .రెడ్డి మాట్లాడుతూ.. 'స‌ప్త‌గిరికి యాప్ట్ స‌బ్జెక్ట్ ఇది. స‌ప్త‌గిరి నుంచి ప్రేక్ష‌కులు ఆశించే అంశాల‌న్నీ ఇందులో పుష్క‌లంగా ఉంటాయి. మ‌హాన‌టుడు ఎన్టీఆర్ న‌టించిన 'గ‌జ‌దొంగ‌' కూ, దీనికీ సంబంధం లేదు. ఇందులో స‌ప్త‌గిరిది దొంగ‌ల‌కు దొంగ‌లాంటి పాత్ర‌. అస‌లు సిస‌లు దొంగ‌ల్ని దోచుకుని స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డే దొంగ‌గా క‌నిపించ‌నున్నాడు. విలేజ్‌, టౌన్ బ్యాక్‌డ్రాప్‌లో న‌డిచే యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. ఆగ‌స్టు తొలి వారంలో చిత్రీక‌ర‌ణ మొద‌లుపెడ‌తాం' అని తెలిపారు. 

ఈ చిత్రానికి ఛాయాగ్ర‌హ‌ణం: ప‌్ర‌వీణ్‌ వనమాలి, సంగీతం:బుల్గానిన్, ఆర్ట్ : వ‌ర్మ‌, మూల కథ-రచనా సహకారం: G.T.R. మహేంద్ర, P.V.సతీష్, లైన్ ప్రొడ్యూసర్:R.V.V.V.ప్రసాద్, నిర్మాత‌లు:  శ‌ర్మ చుక్కా, యెడల నరేంద్ర ,G .V .N .రెడ్డి  , కథ-స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌క‌త్వం:  డి.రామ‌కృష్ణ‌.

Saptagiri Next Movie Title As Gajadonga:

Saptagiri as Gajadonga  

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ