తమన్నా.. 'దటీజ్ మహాలక్ష్మి'!!

Wed 06th Jun 2018 04:08 PM
that is mahalakshmi,that is mahalakshmi movie,tamanna,parul yadav  తమన్నా.. 'దటీజ్ మహాలక్ష్మి'!!
That Is Mahalakshmi Title for Tamanna Queen Remake తమన్నా.. 'దటీజ్ మహాలక్ష్మి'!!
Sponsored links

 

క్వీన్ రీమేక్ సెట్స్ లో  హీరోయిన్ పరుల్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. కన్నడ, తమిళ్, మలయాళం, తెలుగు భాషల్లో ఒకేసారి  తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ మైసూర్ లో శరవేగంగా జరుగుతోంది. షూటింగ్ స్పాట్ లో పరుల్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. చిత్ర బృందంతో పాటు హీరోయిన్ కాజల్, హీరోయిన్ తమన్నా పాల్గొనడం జరిగింది. ఈ మూవీ  తమిళ వర్షన్ లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రలో నటిస్తోంది. దర్శకుడు రమేష్ అరవింద్ కన్నడ, తమిళ్ వర్షన్ క్వీన్ రిమేక్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ  సందర్భంగా హీరోయిన్ పరుల్ యాదవ్ మాట్లాడుతూ... ఇది నాకు స్పెషల్ పుట్టినరోజు. ఈ చిత్రానికి పని చెయ్యడం మర్చిపోలేని అనుభూతి.. అన్నారు. క్వీన్ తెలుగు రీమేక్ లో తమన్నా మెయిన్ పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి 'దటీజ్ మహాలక్ష్మి' పేరును ఖరారు చేసినట్లు తమన్నా తెలిపింది. 100% లవ్ చిత్రంలో తమన్నా పాత్ర పేరు 'దటీజ్ మహాలక్ష్మి' తను మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రానికి అదే టైటిల్ పెట్టడం ఆనందంగా ఉందని తమన్నా చెప్పడం జరిగింది.

నటీనటులు:

తమన్నా, సిద్దు జొన్నలగడ్డ, జి.వి.ఎల్.నరసింహ రావ్, మాస్టర్ సంపత్.

సాంకేతిక నిపుణులు:

సంగీతం: అమిత్ త్రివేది.

కెమెరా మెన్: మిట్చెల్

కాస్ట్యూమ్ డిజైనర్: అదితి అగర్వాల్

నిర్మాత: మను కుమారన్

బ్యానర్: మెడీయంటి ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ ప్రెవేట్ లిమిటెడ్.

Sponsored links

That Is Mahalakshmi Title for Tamanna Queen Remake:

Tamanna New Film Title Confirmed

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019