Advertisementt

'అభిమన్యుడు' అప్డేట్ ఏమిటంటే..!!

Fri 18th May 2018 02:20 PM
abhimanyudu,vishal,samantha,censor,release  'అభిమన్యుడు' అప్డేట్ ఏమిటంటే..!!
Abhimanyudu Censor Completed 'అభిమన్యుడు' అప్డేట్ ఏమిటంటే..!!
Advertisement
Ads by CJ

మే చివరి వారంలో మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' 

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో తమిళ్‌లో రూపొందిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఇరుంబుతెరై'. ఇటీవల తమిళనాడులో విడుదలైన ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది. ఈ చిత్రాన్ని 'అభిమన్యుడు' పేరుతో ఎం.పురుషోత్తమన్‌ సమర్పణలో వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై జి.హరి తెలుగులో విడుదల చేస్తున్నారు. సమంత హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ఓ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. మే చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

ఈ సందర్భంగా హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ అధినేత జి.హరి మాట్లాడుతూ.. 'అభిమన్యుడు' చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. తమిళ్‌లో ఇటీవల విడుదలైన ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్‌ వచ్చాయి. విశాల్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా ఈ చిత్రం నిలిచింది. రివ్యూస్‌ కూడా చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చాయి. 'రంగస్థలం', 'మహానటి' వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించిన హీరోయిన్‌ సమంతకు 'ఇరుంబుతెరై' హ్యాట్రిక్‌ చిత్రంగా నిలిచింది. తమిళ్‌లో అద్భుత విజయాన్ని అందుకున్న ఈ చిత్రం తెలుగులో కూడా చాలా పెద్ద హిట్‌ అవుతుంది..అన్నారు. 

మాస్‌ హీరో విశాల్‌, సమంత, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌తోపాటు భారీ తారాగణం ఈ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: జార్జి సి. విలియమ్స్‌, ఎడిటింగ్‌: రూబెన్‌, ఫైట్స్‌: దిలీప్‌ సుబ్బరాయన్‌, ఆర్ట్‌: ఉమేష్‌ జె.కుమార్‌, మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి, నిర్మాత: జి.హరి, దర్శకత్వం: పి.ఎస్‌.మిత్రన్‌.  

Abhimanyudu Censor Completed:

Abhimanyudu Movie Release on May Ending

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ